నాలుగేళ్ల క్రిత‌మే పెగ‌స‌స్ ఆఫ‌ర్.. కానీ తిర‌స్క‌రించా : మ‌మ‌తా బెన‌ర్జీ

-

గ‌త ఏడాది పెగ‌స‌స్ స్పైవేర్ గురించి కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విషయం తెలిసిందే. కాగ తాజా గా బెంగాల్ ముఖ్య‌మంత్రి పెగ‌స‌స్ స్పైవేర్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇజ్రాయెల్ భ‌ద్ర‌తా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ త‌యారు చేసిన పెగ‌స‌స్ స్పైవేర్ ను కొనుగోలు చేయాల‌ని త‌న వద్దకు నాలుగు ఏళ్ల క్రిత‌మే వ‌చ్చింద‌ని మ‌మ‌తా బెనర్జీ అన్నారు. పెగ‌స‌స్ స్పైవేర్ ను కేవ‌లం రూ. 25 కోట్ల‌కే విక్ర‌యిస్తామ‌ని ఎన్ఎస్ఓ సంస్థ ఆఫ‌ర్ చేసింద‌ని అన్నారు.

కానీ పెగ‌స‌స్ స్పైవేర్ ల‌ను కొనుగోలు చేయ‌డం రాజ‌కీయ దోపిడికి పాల్ప‌డిన‌ట్టే అని తిర‌స్క‌రించాన‌ని అన్నారు. దీన్ని ఉప‌యోగించి న్యాయ‌మూర్తులు, కేంద్ర సంస్థల అధికారుల సీక్రెట్ వ్య‌వ‌హ‌రాల‌ను తెలుసుకోవ‌డం స‌బబు కాద‌ని ఎన్ఎస్ఓ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించాన‌ని అన్నారు. కాగ పెగ‌స‌స్ స్పైవేర్ ను ప్ర‌పంచ దేశాల‌కు ఇజ్రాయెల్ విక్ర‌యిస్తుంది.

కాగ ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం 50 దేశాలు ఈ పెగ‌స‌స్ స్పైవేర్ ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశాయ‌ని ఒక అంత‌ర్జాతీయ మీడియా తెలిపింది. కాగ అందులో భార‌త‌దేశం కూడా ఉంద‌ని ఒక ఆరోప‌ణ ఉంది. దీని పై ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. దీనిపై మొద‌ట బెంగాల్ రాష్ట్రామే స్పందించింది. అంతే కాకుండా దీనిపై విచార‌ణ‌కు కూడా దేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news