లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు పరాభవమే… తేల్చేసిన పీపుల్స్ పల్స్ సర్వే

-

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని తేల్చేసింది పీపుల్స్ పల్స్ సర్వే.అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లోక్సభ సీట్లను కైవసం చేసుకోనుందని ఈ సర్వే చెప్తోంది.లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బిజెపి సత్తాచాటినా తెలంగాణలో మాత్రం అత్యధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తోంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకంతో వున్నారని… అది లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బయటపడతుందని అంటున్నారు. ఇలా పీపుల్స్ ఫల్స్ – సౌత్ ఫస్ట్ సర్వే సంస్థ తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితం ఎలా వుండనుందో ప్రకటించింది.

brs party

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఓట్లు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని పీపుల్స్ సర్వే తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల కంటే 9 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చినా సీట్లు మాత్రం పెరగకపోవచ్చని సర్వే సంస్థలు తెలిపాయి. తెలంగాణలో బిజెపికి 23 శాతం ఓట్లు… 2 నుండి 4 ఎంపీ సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. అధికార కాంగ్రెస్ కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో స్వల్పంగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటుందని ప్రకటించారు. 40 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఏకంగా 8 నుండి 10 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుంది అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న బిఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదని పీపుల్స్ సర్వే తేల్చింది.

అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓట్లు రావని… 6 శాతం ఓట్లను కోల్పోతుందని సర్వే సంస్థలు తెలిపాయి.మొత్తంగా 31 శాతం ఓట్లతో బిఆర్ఎస్ కేవలం 3 నుండి 5 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకునే అవకాశం వుందని పీపుల్స్ పల్స్ – సౌత్ ఫస్ట్ సర్వే వెల్లడించింది.ఉచిత బస్ పథకం,500రూ.కే గ్యాస్ సీలిండర్ స్కీంతో తెలంగాణ మహిళల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరిగిందని… 47 శాతం మంది ఆ పార్టీకి అనుకూలంగా ఓటేసేందుకు సిద్దంగా వున్నట్లు సర్వే రిపోర్ట్ తెలిపింది. పురుషుల్లో 37 శాతం మాత్రమే కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారని అంచనా వేసింది.గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కి ఓటర్ల నుంచి తక్కువ మద్దతు లభిస్తోందని వెల్లడించాయి సర్వే సంస్థలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version