ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. హోంశాఖ ఎవరికంటే?

-

డిప్యూటీ సీఎంలుగా ఆళ్ల నాని, అంజాద్ భాషా, నారాయణ స్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణిలు నియమితులయ్యారు. మంత్రుల శాఖలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇక.. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖ హోంను మేకతోటి సుచరితకు అప్పగించారు.

ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇవాళ ఉదయం 25 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 25 మందికి తాజాగా ఆయా శాఖలు కేటాయించారు. దానికి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. వీరిలో ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు.

డిప్యూటీ సీఎంలుగా ఆళ్ల నాని, అంజాద్ భాషా, నారాయణ స్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణిలు నియమితులయ్యారు. మంత్రుల శాఖలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇక.. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖ హోంను మేకతోటి సుచరితకు అప్పగించారు.

మంత్రులకు కేటాయించిన శాఖలు

1. ధర్మాన కృష్ణదాస్‌ : రోడ్లు భవనాలు
2. బొత్స సత్యనారాయణ : మున్సిపల్‌ శాఖ
3. పాముల పుష్పశ్రీవాణి : ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమం
4. అవంతి శ్రీనివాస్‌ : టూరిజం
5. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ : ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ
6. కురసాల కన్నబాబు : వ్యవసాయ శాఖ
7. పినిపె విశ్వరూప్‌ : సాంఘీక సంక్షేమం
8. ఆళ్ల నాని : వైద్య ఆరోగ్య శాఖ
9. తానేటి వనిత : మహిళా సంక్షేమం
10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు : గృహ నిర్మాణం
11. వెల్లంపల్లి శ్రీనివాస్‌ : దేవాదాయ శాఖ
12. కొడాలి నాని : పౌరసరఫరా శాఖ
13. పేర్ని నాని : సమాచార శాఖ
14. మేకతోటి సుచరిత : హోం శాఖ
15. మోపిదేవి వెంకటరమణారావు : మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్‌ శాఖ
16.బాలినేని శ్రీనివాసరెడ్డి : అటవీ పర్యావరణ శాఖ
17. ఆదిమూలపు సురేష్‌ : విద్యాశాఖ
18.పాలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ : నీటిపారుదల శాఖ
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్య శాఖ
20. షేక్‌ బేపారి అంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : పంచాయితీ రాజ్‌, గనుల శాఖ
22. కళత్తూరు నారాయణస్వామి : ఎక్సైజ్‌ శాఖ
23. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి : ఆర్థిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారా శాఖ
24. గుమ్మనూరు జయరామ్‌ : కార్మిక శాఖ
25. మాలగుండ్ల శంకరనారాయణ : బీసీ సంక్షేమం

Read more RELATED
Recommended to you

Latest news