పవన్ ఊసరవెల్లి … ప్రకాష్ సంచలనం ?

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అంటూ, సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా, అనేక అంశాలపైనా ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల హడావుడి జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశం పైన ప్రకాష్ రాజ్ స్పందించారు. బిజెపికి పవన్ మద్దతు పలకడం పై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవన్ తనను పూర్తిగా నిరాశ పరిచాడని, అతను ఒక నాయకుడు . అతనికి జనసేన అనే రాజకీయ పార్టీ ఉంది. అలాంటి పవన్ బిజెపి పంచన చేరడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రకాష్ ప్రశ్నించారు. అసలు తెలుగు రాష్ట్రాలలో పవన్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఏమిటని ? బిజెపి ఓటు బ్యాంక్ ఏమిటని ? కనీసం ఒక్క శాతం కూడా లేని బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు అవసరమా అంటూ ప్రశ్నించారు.

మొదట్లో మోదీ మంచివాడని మద్దతు తెలిపాడు, ఆ తరువాత మోడీ చెడ్డవాడు అని ప్రచారం చేశాడు. ఎన్నికల తర్వాత మళ్లీ మోడీ గ్రేట్ లీడర్స్ అంటున్నాడు. ఇలా నాలుగైదు మాటలు మాట్లాడే పవన్ నాకు ఊసరవెల్లి లా కనిపిస్తున్నాడు అంటూ ప్రకాష్ రాజ్ విమర్శించారు. జన హితం కోసం పవన్ బీజేపీకి మద్దతు ఇస్తున్నా డు అని రిపోర్టర్ ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించగా .. వాళ్లు అధికారంలోకి వచ్చి ఏ మంచి పనులు చేశారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. కేసీఆర్ తోనే హైదరాబాద్ సేఫ్ అంటూ ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిజెపి రాకతో హిందూ ముస్లిం మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని, ప్రకాష్ రాజ్ అనుమానం వ్యక్తం చేశారు దొంగల మాదిరిగా అశాంతి గందరగోళం సృష్టించి దోచుకోవాలని చూస్తున్నారు అని విమర్శించారు.

మొదటి నుంచి బిజేపి వైఖరిపై ప్రకాష్ రాజ్ ఇదే వైఖరితో ఉంటూ వస్తున్నారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని సైతం ప్రకాష్ రాజ్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ పై ఈ విధంగా సంచలన ఆరోపణలు చేస్తూ టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంచలనం సృష్టిస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news