పీకే డైరక్షన్: కమలం టార్గెట్‌గా కేసీఆర్ చక్రం తిప్పుతున్నారా?

-

ఈ మధ్య తెలంగాణ రాజకీయాలు జాతీయ స్థాయిలో నడుస్తున్నాయి. స్టేట్‌లో నేషనల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అసలు రాష్ట్ర రాజకీయాలు కాస్త జాతీయ రాజకీయలుగా మారిపోయాయి. అలా టీఆర్ఎస్, బీజేపీలు మార్చేశాయి. అసలు రాష్ట్రంలో రెండు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇక ఒక పార్టీకి చెక్ పెట్టాలని మరొక పార్టీ స్కెచ్‌లు వేసుకుంటూ వెళుతున్నాయి.

అయితే తెలంగాణలో కేసీఆర్‌ని గద్దె దించి అధికారంలోకి రావాలని బీజేపీ తెగ ట్రై చేస్తుంది. ఆ దిశగానే ముందుకెళుతుంది. బీజేపీ నేషనల్ పార్టీ కావడంతో…జాతీయ నాయకులు సైతం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. వరుసపెట్టి జాతీయ నేతలు తెలంగాణలో అడుగుపెడుతూ, కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు. ఇక ఈ పరిస్తితుల్లో తనకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని అర్ధం చేసుకున్న కేసీఆర్ సైతం..జాతీయ స్థాయిలో బీజేపీకి చెక్ పెట్టేందుకు చక్రం తిప్పడం మొదలుపెట్టారు.

ఇప్పటికే కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టాలని చెప్పి మమతా బెనర్జీ నేతృత్వంలోని కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లేకుండా ఆ కూటమి ఏర్పాటు దిశగా మమతా ముందుకెళుతున్నారు. ఈ కూటమికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. అయితే ఈ కూటమిలో కేసీఆర్ కూడా కీలకంగా కానున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన కూడా పీకే డైరక్షన్‌లో ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు.

ఇప్పటికే ఆయన డి‌ఎం‌కే, ఎన్‌సి‌పి పార్టీల అధినేతలని కలిశారు. ఇటీవల కమ్యూనిస్ట్ నేతలతో సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో ఉన్న కమ్యూనిస్ట్ నేతలంతా ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్‌ని కలిశారు. తాజాగా బీహార్‌లో కీలకంగా ఉన్న ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ తెలంగాణ వచ్చి కేసీఆర్‌ని కలిశారు. ఇలా బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు. కమలానికి చెక్ పెట్టడానికి కేసీఆర్ ఇలా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news