న్యాయంగా చేపట్టాల్సిన పనులు కొన్ని చేయాల్సిందే ! న్యాయ దేవతను నమ్ముకుని ప్రయాణించాల్సిందే ! న్యాయం ఉనికికి విఘాతం తీసుకువచ్చే పనులు ఏవీ చేయకూడదు. కానీ ఆ బాలిక విషయమై అనగా 16 ఏళ్ల మైనర్ బాలిక విషయమై పోలీసులు న్యాయాన్ని నమ్ముకోవడం లేదు. కేవలం రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి.
కానీ ఓ బక్క చిక్కిన ప్రాణి మాత్రం తన వంతుగా వ్యవస్థకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. వ్యవస్థలో లోపాలు దిద్దేందుకు కూడా కొన్ని పోలీసు చర్యలు అడ్డంగా ఉన్నా కూడా పోరాడుతున్నారు. ఆ ఒక్క ప్రాణం పేరు.. రఘనందన్ రావు ..
అయితే.. రఘునందన్ మాత్రం తదేక దీక్షతో పోరాటం చేస్తున్నారు. పోలీసుల వెర్షన్ ఎలా ఉన్నాకూడా తన వెర్షన్ మాత్రం సూటిగానే ఉంది అని స్పష్టం చేస్తున్నారు. ఓ విధంగా ఆయన సాహసం కారణంగా వివాదాస్పద ఆర్జీవీ కూడా ఫిదా అయిపోయారు. ఆయన కూడా దుబ్బాక ఎమ్మెల్యే రఘ నందన్ కు మద్దతివ్వడం విశేషం.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్లు వచ్చినా నిజాలను నమ్ముకుని ప్రయాణించడం మంచి పని! ఆ మంచి పని ఎవ్వరు చేసినా అభినందించాలి. ఒకప్పుడు జర్నలిజం చేసిన రఘునందన్ తరువాత కాలంలో పొలిటీషియన్ గా ఎదిగారు. కొంత కాలం ఆయన పూర్వాశ్రమాన ఎంఐఎం పార్టీకి అంటే ఓవైసీకి వకీలుగా పనిచేశారు. అయినా సరే ! జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఇష్యూకు సంబంధించి ఆయన పోరాడుతున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును, సంబంధిత ఆధారాలను బయటపెట్టేందుకు వెనుకాడేది లేనే లేదని అంటున్నారు. ఓ విధంగా ఆయన సాహసం బాగుందని అంతా అంటున్నారు. ఓ విధంగా ఆయన ధైర్యం బాగుందని అంటా కొనియాడుతున్నారు.
వాస్తవానికి ఈ కేసులో టీఆర్ఎస్,ఎంఐఎం పెద్దల పిల్లలు ఇందులో నిందితులుగా ఉన్నారు. ఇప్పటిదాకా ఆరుగురు నిందితులు అని తేలారు. ఓ ఎమ్మెల్యే కొడుకు పేరు తేల్చేందుకు ఆఖరిదాకా పోలీసులు తర్జనభజర్జన పడ్డారు. ఆఖరికి ఆయన పేరు కూడా చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ పోరులో గెలిచింది రఘునందన్ రావు. అందుకే సోషల్ మీడియాలో కూడా ఆయనకు భలే మద్దతు వస్తోంది. వివాదాస్పద దర్శకులు ఆర్జీవీ కూడా ఆయనను మెచ్చుకుంటున్నారు. ఈకేసులో రఘనందన్ రావు చెప్పినవన్నీ సబబుగానే ఉన్నాయి అని స్పందించారు ఆయన.