పాపం ! ఈడీ జ‌గ‌న్ను వ‌దిలేసి రాహుల్ ను ప‌ట్టుకుంది?

-

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు కు సంబంధించి ఇవాళ రాహుల్ గాంధీ అనే యువ‌నేత ఈడీ ఎదుట హాజ‌రుకానున్నారు. త‌న వాద‌న వినిపించ‌నున్నారు. ఇదే కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధినేత్రి సోనియా కరోనా కార‌ణంగా ఆస్ప‌త్రిలో ఉన్నారు. ఢిల్లీలో గంగారామ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.  ఆమెకు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఉంద‌ని, దాంతో ఆమె బాధప‌డుతున్నార‌ని వైద్య వ‌ర్గాలు ధ్రువీక‌రిస్తున్నాయి.

మ‌రోవైపు రాహుల్ ఇవాళ ఈడీకి ఏం చెప్ప‌నున్నారో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. త‌మ‌ను వేధిస్తున్నార‌ని ఏఐసీసీ వ‌ర్గాలు అంటున్నాయి. హైద్రాబాద్ లో కూడా రాహుల్ కు సంఘీభావంగా ర్యాలీలు తీసేందుకు టీపీసీసీ ప్లాన్ చేసింది. పోలీసుల అనుమ‌తి కూడా తీసుకుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆ రోజు జ‌గ‌న్ విష‌య‌మై కూడా సోనియా ఈడీ అస్త్రాన్నే క‌దా ఉపయోగించారు.

అది క‌క్ష సాధింపు కాన‌ప్పుడు ఇది కూడా కాదు అన్న వాద‌న ఒక‌టి విన‌వ‌స్తోంది. ఎందుకంటే వైఎస్సార్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించార‌ని చెబుతూ, ఆ రోజు ఆయ‌న అధికారం అడ్డు పెట్టుకుని జ‌గ‌న్ హ‌వాలా దారుల్లో డ‌బ్బులు సంపాదించార‌ని అభియోగాలు మోపుతూ సోనియా త‌ర‌ఫున ఈడీ ప‌నిచేసింద‌న్న వాద‌న‌లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సోనియా చెప్పిన విధంగానే ఈడీ న‌డుచుకుంద‌న్న మాట వైఎస్ అభిమాన వ‌ర్గానికి చెందిన కొందరు సీనియ‌ర్  లీడ‌ర్లు ఇప్ప‌టికీ అంటుంటారు.

ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయ్యారు. ఈడీ కేసులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని నిరూప‌ణ‌లో ఉన్నాయి. ఇదే కేసు ప‌దేళ్లుగా న‌డుస్తోంది కానీ ఓ కొలిక్కి రాలేక‌పోతోంది.ఇప్పుడు రాహుల్ సీన్ లోకి వ‌చ్చారు. ఆయ‌న కూడా ఈడీ ద‌గ్గర నుంచి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇక వీరి స‌చ్ఛీల‌త ఏంట‌న్న‌ది కాల‌మే చెప్పారు. వీరిద్ద‌రూ అంటే సోనియా మ‌రియు రాహుల్ అని అర్థం.

ఎందుకంటే ఆ రోజు అధికార దుర్వినియోగం చేయ‌లేద‌ని సోనియా వ‌ర్గం అంటే ఇప్పుడు కూడా బీజేపీ త‌ర‌ఫున నాయ‌కులు కూడా ఈ కేసును క‌దిపే విష‌య‌మై అధికార దుర్వినియోగం చేయ‌లేద‌నే భావించాలి అన్న‌ది ఓ వ‌ర్గం విశ్లేషణ. అసలు కొన్ని రోజులుగా ఈ కేసులో ద‌ర్యాప్తు ముందుకు వెళ్తుంది. ఈ క్ర‌మంలో భాగంగా ఒక‌వేళ యువ నేత రాహుల్ అరెస్టు ఉంటే, ఆ రోజు
ప‌క్క‌దోవ‌లో ఇంకా చెప్పాలంటే హ‌వాలా దారుల్లో ఆయ‌న ఖాతాలోకి వ‌చ్చిన డ‌బ్బు ఏమ‌యిందని? దీనిపై కూడా మాట్లాడాలి.

Read more RELATED
Recommended to you

Latest news