ధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్, బీజేపీ రాజకీయం…. తెలుగులో ట్విట్ చేసిన రాహుల్ గాంధీ

-

తెలంగాణలో రైతు సమస్యలపై రాహుల్ గాంధీ తెలుగులో ట్విట్ చేశారు. తెలంగాణ రైతులకు మద్దతుగా ట్విట్ చేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతలను విస్మరిస్తూ… రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటని విమర్శించారు. రైతు వ్యతిరేఖ విధానలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెడుతున్నారని… పండించిన ప్రతీ గింజ కొనాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో పండించిన ప్రతీ గింజ కొనే వరకు రైతుల తరుపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని ట్విట్ చేశారు.rahul gandhi

తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ తరుపు రాహుల్ గాంధీ ట్విట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదీ కూడా తెలుగులో ట్విట్ చేశారు. దీంతో ధాన్యం కొనుగోలు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని చెప్పినట్లు అయింది. కాంగ్రెస్ అధినేత తెలంగాణ సమస్యలపై ట్విట్ చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మరింతగా ఉత్సాహాన్ని నింపనుంది. రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ధాన్యం కొనుగోలు విషయంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news