జగన్- చంద్రబాబు మధ్య నలిగిపోతున్న వంశీ…?

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు హీట్ పెంచాయి. ఈ నెల నాలుగు స్థానాలు ఖాళీ కావడం ఆ నాలుగు స్థానాలను వైసీపీ దక్కించుకుంటున్న నేపధ్యంలో దీని గురించి పెద్దగా ఆసక్తి లేకపోయినా జరుగుతున్న రాజకీయం మాత్రం ఇప్పుడు హీట్ పెంచుతుంది అనే చెప్పాలి. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల బరిలో… పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యని నిలిపింది.

ఇక చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ ఓటు వెయ్యాలని విప్ జారీ చేసారు. ఎవరికి ఓటు వేస్తున్నారో ఏజెంట్ కి చూపించి వెయ్యాలని ఆదేశాలు జారీ చేసారు చంద్రబాబు. ఇక విప్ ని ఎవరైనా దిక్కరిస్తే అనర్హత వేటు పడుతుంది అని హెచ్చరించారు. దీనితో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఒకరు కాగా… గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఒకరు.

మద్దాలి గిరి టీడీపీ కి రాజీనామా చేయకపోయినా వంశీ టీడీపీకి రాజీనామా చేసారు. దీనితో ఆయన పార్టీ మారతారని భావించారు అందరూ. కాని ఆయన ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉండిపోయారు. ఈ నేపధ్యంలో ఆయన రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసే అవకాశం ఉంది అనే దాని మీద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు వంశీ అటు జగన్ కి ఎదురు చెప్పలేక ఇటు టీడీపీ కి ఎదురు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు.

ఆయన గనుక పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే అనర్హత వేటు పడటం ఖాయం. కాబట్టి ఇప్పుడు టీడీపీకి ఓటు వేయక తప్పని పరిస్థితి. మరి ఆయన టీడీపీకి ఓటు వేస్తే ఎం జరుగుతుంది అనేది చూడాలి. ఇక మద్దాలి గిరి టీడీపీలో ఉన్నాను అంటున్నా ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి. వచ్చే నెల మొదటి వారంలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news