ఆగస్టు 8న ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా : రాజగోపాల్ రెడ్డి

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం ముగిసింది. తాను భాజపాలో చేరే తేది గురించి షాతో చర్చించినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈనెల 8న తెలంగాణ శాసనసభ స్పీకర్ ను కలిసి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తూ లేఖను సమర్పిస్తానని చెప్పారు.

ఉప ఎన్నిక జరిగితేనే మునుగోడు అభివృద్ధి చెందుతుందని అన్నారు. మునుగోడు తీర్పు మార్పునకు నాంది అవుతుందని పేర్కొన్నారు. అమిత్ షా తనను పార్టీలోకి ఆహ్వానించినట్లు వెల్లడించారు. తాను త్వరలోనే కమలతీర్థం పుచ్చుకుని కాషాయ కండువా కప్పుకుంటానని స్పష్టం చేశారు.

ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధిష్ఠానానికి గురువారం రోజున రాజగోపాల్ రెడ్డి లేఖను పంపారు. భవిష్యత్​ కార్యాచరణకు వేగంగా అడుగులు వేస్తున్నారు. రెండేళ్లకు పైగా కాంగ్రెస్​ను వీడే విషయంలో సందిగ్ధంలో ఉన్న ఆయన.. సొంతపార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. భాజపాను పొగడ్తలతో ముంచెత్తుతూ వచ్చారు. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించిన రాజగోపాల్.. గురువారం రాజీనామా చేశారు. ఈనెల 8న ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news