ఏపీ రాజకీయాల్లో రజనీకాంత్..ఎఫెక్ట్ ఉంటుందా?

-

ఏపీ రాజకీయాల్లో రజనీకాంత్ ఎఫెక్ట్ ఉంటుందా? అదేంటి అసలు ఆయన తమిళనాడు..పైగా రాజకీయాల్లో కూడా లేరు కదా..అలాంటప్పుడు ఏపీ రాజకీయాలపై ఆయన ప్రభావం ఎందుకు ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఇటీవల ఏపీ రాజకీయాల్లో రజనీకాంత్ పేరు ఎక్కువగానే వినిపిస్తుంది. ఆ మధ్య ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చి..ఎన్టీఆర్, చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తి..వైసీపీ నేతల చేత తిట్లు తిన్న రజనీకాంత్..చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్‌కు ఫోన్ చేసి..అండగా నిలబడ్డారు.

అంటే ఆయన..బాబు స్నేహితుడు కావడంతో..టి‌డి‌పికి రజనీ మద్ధతు ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రజనీ అభిమానుల మద్ధతు టి‌డి‌పికే ఉంటుందని అంటున్నారు. ఏపీలో రజనీ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రజనీ అభిమానులు ఎక్కువే. వారు వైసీపీకి యాంటీగా మారి..టి‌డి‌పికి సపోర్ట్ చేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఏపీలో రజనీ ఫ్యాన్స్ టి‌డి‌పి-జనసేనకు మద్ధతు తెలుపుతున్నారనే దానికి ఉదాహరణ..తాజాగా పవన్..ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో బహిరంగ సభ నిర్వహించగా..అక్కడ కొందరు అభిమానులు రజనీ ఫ్లెక్సీలతో కనిపించారు.

ఈ క్రమంలో పవన్ స్పందిస్తూ.. తాను ముదినేపల్లికి వస్తుండగా తనకు దారి పొడవునా స్వాగతం పలికిన మహేశ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌, మెగాస్టార్‌, రజనీకాంత్‌ అభిమానులందరికీ ధన్యవాదాలు అని చెప్పి… వైసీపీ వాళ్లు ఎలా ఉన్నారంటే ఆధ్యాత్మికంగా జీవించడానికి ఇష్టపడే రజనీకాంత్‌నూ వదలలేదని, నోటికి వచ్చినట్లు తిట్టారని,  ఏ ఒక్కరూ ఇంకొకరిని పొగడకూడదు…చేసిన మంచి గురించి మాట్లాడకూడదు.. కేవలం వైసీపీ వాళ్లనే పొగడాలట. ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్తానని పవన్ మాట్లాడారు.

దీని బట్టి చూస్తే ఏపీలో రజనీని అభిమానించే వారు..టి‌డి‌పి వైపు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో చెప్పలేం..వారు ఎంతమేర రాజకీయంగా ప్రభావితం చేస్తారో చెప్పలేం. అలాగే ఎన్నికల సమయంలో రజనీ వచ్చి టి‌డి‌పి తరుపున ప్రచారం చేస్తారా? లేదా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news