బండ్ల గణేశ్….ఈయనొక చిన్నపాటి సంచలనం…ఈయన ఏం మాట్లాడిన అది పెద్ద సెన్సేషన్ అయిపోతుంది. అయితే సినీ పరిశ్రమలో నిర్మాతగా, కమెడియన్గా దూసుకుపోతున్న బండ్ల…రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. మొదట నుంచి బండ్ల కాంగ్రెస్ అభిమానిగా ఉన్నారు. అందుకే 2018 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక బండ్ల చేసిన హడావిడి గురించి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తూ…కాస్త ఓవర్ కూడా చేసేశారు. కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసేసుకుంటా అని కూడా అన్నారు.
కానీ కాంగ్రెస్ చిత్తుగా ఓడింది….ఆ తర్వాత బండ్ల రాజకీయాల్లో అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. పైగా మీడియాలో బండ్ల గణేశ్ కాస్త బ్లేడు గణేశ్ అయిపోయారు. అయితే అప్పుడు రాజకీయాల్లో అడ్రెస్ మిస్ అయిన బండ్ల ఈ మధ్య ‘ మా’ ఎన్నికల సందర్భంగా కాస్త హడావిడి చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్లో ఉన్నానని, టిపిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తాజాగా ఓ కార్యక్రమంలో బండ్ల, రేవంత్ రెడ్డిలు కలిశారు.
ఇక అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి… బండ్ల మళ్ళీ పార్టీలోకి వచ్చి యాక్టివ్గా పనిచేయాలని కోరారు. రేవంత్ అన్న ఆదేశిస్తే అడుగు ముందుకు వేస్తానని బండ్ల గణేష్ సమాధానం ఇచ్చారు. అయితే బండ్లని రేవంత్ పార్టీలో యాక్టివ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కాకపోతే ఈ సారి ఒక లిమిట్లో మాట్లాడేలా చేయాలని రేవంత్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే బండ్ల కాంగ్రెస్లో యాక్టివ్ అయితే….నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఆశించే అవకాశాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లోనే బండ్ల షాద్నగర్ సీటు ఆశించారు. కానీ ఏ సీటు బండ్లకు దక్కలేదు. ఈ సారి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బండ్ల ఆతృతగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి…బండ్లకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారో లేదో చూడాలి.