థర్డ్ ప్లేస్‌కే రేవంత్..ఊపు ఏది?

-

తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వ్యూహాత్మకంగా కిందకు తోక్కేస్తున్నారో లేక..ఆ పార్టీలోనే అంతర్గత సమస్యలు కిందుకు పడిపోయాలా చేస్తున్నాయో తెలియదు గాని..అసలు తెలంగాణలో బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఇప్పుడు కనీసం సెకండ్ ప్లేస్‌లో కాదు..థర్డ్ ప్లేస్‌లోకి పడిపోయేలా ఉంది. తెలంగాణ వచ్చాక జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే నిలిచింది. అయితే టీఆర్ఎస్ వైఫల్యాలని యూజ్ చేసుకుని కాంగ్రెస్ బలపడి మూడోసారైనా గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కానీ కేసీఆర్ వ్యూహాలు, బీజేపీ ఎత్తుగడలు..కాంగ్రెస్ సొంత తప్పిదాలతో..రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా తయారైంది. నిజానికి రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఇక టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్ చేశారు. అంటే బలంగా లేని బీజేపీని టార్గెట్ చేసి..కాంగ్రెస్‌ని రేసులో లేకుండా చేశారు. అటు బీజేపీ కూడా వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుని బలపడింది.

దీంతో పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. పైగా కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు వల్ల..పార్టీ మూడో ప్లేస్‌కు వెళ్లిపోతుంది. అయితే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది. టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే. అయినా సరే రేవంత్ రెడ్డి కూడా ఆ అంశంపై దృష్టి పెట్టి పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ మధ్య రేవంత్‌లో కూడా దూకుడు తగ్గింది.

టీఆర్ఎస్‌పై దూకుడుగా విమర్శలు చేసి హైలైట్ కావడం లేదు..ఏదో అందరి మాదిరిగానే రేవంత్ ముందుకెళుతున్నారు. అలాగే పార్టీని బలోపేతం చేసే విషయంలో రేవంత్ రాష్ట్రం మొత్తం పర్యటించడం లేదు. భారీ భారీ సభలు పెట్టి పార్టీకి ఊపు తీసుకురావడం లేదు. పి‌సి‌సి అయిన మొదట్లో భారీ సభలతో సక్సెస్ అయ్యారు. సభలకు ప్రజలు కూడా భారీగా వచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఊసు లేదు. ఇప్పటికైనా రేవంత్ ఫోకస్ పెట్టి పనిచేసి..పార్టీ బలం పెంచవచ్చు. లేదంటే కాంగ్రెస్ మూడో ప్లేస్‌కే పరిమితం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news