కాంగ్రెస్ క్యాండిడేట్ విష‌యంలో రేవంత్ మాస్ట‌ర్ ప్లాన్‌.. అప్పుడే ప్ర‌క‌టిస్తాడంట‌..?

అనుముల రేవంత్‌ రెడ్డి ( Revanth Reddy ) మొద‌టి నుంచి తాను అనుకున్న‌ట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అధినేత అయ్యారు. అయితే ఆయ‌న ఇలా ప‌గ్గాలు చేజిక్కించుకున్నారో లేదో గానీ సొంత పార్టీ నుంచే సీనియ‌ర్లు రాజీనామాల దాకా వెళ్ల‌డం పెద్ద ఆయ‌న ఇమేజ్ ను కాస్త దెబ్బ తీసిన‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం ఇలాంటివి ప‌ట్టించుకోకుండా త‌న ఇమేజ్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఇప్పుడు ఆయ‌న ముందు ఉన్న మ‌రో పెద్ద స‌వాల్ హుజూరాబాద్ ఉప ఎన్నిక కావ‌డం, అది కూడా అత్యంత ప్ర‌తిష్టాత‌మ్క ఎన్నిక కావ‌డం ఇప్పుడు పెద్ద ట్విస్టుగా మారింది.

 

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఇక అనుకోని విధంగా ఇక్క‌డి అభ్య‌ర్థిగా ఉంటున్న పాడి కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్ కావ‌డం, ఇందులో ఆయ‌న‌కే టీఆర్ ఎస్ టికెట్ వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో పెద్ద సంక్షోభం ఏర్ప‌డ‌టంతో చివ‌ర‌కు ఆయ‌న పార్టీకి రాజీనామా చేయ‌డం దాకా వెళ్లాయి. ఇక ఇప్పుడు ఆయ‌న టీఆర్ ఎస్‌లో చేర‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

మ‌రి ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవ‌ర‌నేది ఇప్పుడు రేవంత్ ను టెన్ష‌న్ పెడుతోంది. ఇక మొద‌టి నుంచి వినిపిస్తున్న పొన్నప్ర‌భాక‌ర్ ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక అధికార టీఆర్ ఎస్ పార్టీ కూడా త‌మ క్యాండిడేట్‌ను ప్ర‌క‌టించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాము ముందే క్యాండిడేట్‌ను చెప్పేస్తే ఒక‌వేళ టీఆర్ ఎస్ గాలం వేస్తుందేమో అన్న భ‌యం కూడా రేవంత్‌ను వెంటాడుతోంది. అందుకే టీఆర్ఎస్ ప్ర‌క‌టించిన త‌ర్వాతే తాము రివీల్ చేయాల‌ని రేవంత్ చూస్తున్నారు.