ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నాయకులు భవిష్యత్తు ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేయడం మనం అందరం చూశాం. దీంతో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు.
టిఆర్ఎస్ పార్టీలో ఒకానొక సమయంలో మామా అల్లుళ్లు అయినా కెసిఆర్ మరియు హరీష్ శంకర్ ల మధ్య గొడవలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి అని తర్వాత బావా బామ్మర్దుల మధ్య అనగా హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ అన్నారని కానీ ఇప్పుడు తాజాగా కేటీఆర్ వర్సెస్ కెసిఆర్ అంటున్నారని దీన్ని బట్టి చూస్తే టిఆర్ఎస్ పార్టీలో స్పష్టమైన నాయకత్వ లోపం ఉందని కెసిఆర్ నాయకత్వం పై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారని తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
అసలు టిఆర్ఎస్ పార్టీలో నాయకుల మధ్య సరైన అవగాహన ఉండదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ జనం నవ్వుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం కేటీఆర్ ని భవిష్యత్తు ముఖ్యమంత్రి అని తేల్చారు అని కానీ అక్కడ కూడా ఆ సందర్భంలో కెసిఆర్ పై గాని ఆయన నాయకత్వంపై గాని ఒక్క విమర్శ కూడా చేయలేదు అని పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ వర్సెస్ కేసీఆర్ అన్న విధంగా జనంలో చిత్రీకరించాలని చూసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.