ఖ‌మ్మం జిల్లా టీఆర్ఎస్ నేత‌ల‌పై రేవంత్ ఫోక‌స్‌.. కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సీత‌క్క చ‌ర్చ‌లు

టీపీసీసీ చీఫ్ ప‌గ్గాలు రేవంత్ రెడ్డి తీసుకున్న త‌ర్వాత కాంగ్రెస్ లో బ‌ల‌మైన మార్పు వ‌స్తోంది. కాంగ్రెస్ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఉన్న స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయి ఇప్పుడు కొత్త ఉత్సాహం వ‌స్తోంది. రేవంత్‌రెడ్డి ప‌క్కా వ్యూహంతో రాజ‌కీయ అడుగులు వేస్తుండ‌టం ఆ పార్టీకి బాగా క‌లిసి వ‌చ్చే అంశ‌మ‌నే చెప్పాలి. అయితే గ‌తంల కాంగ్రెస్ నుంచి దూర‌మైన ప్ర‌తి వ‌ర్గాన్నిఇప్పుడు రేవంత్ మ‌ల్లీ ద‌గ్గ‌ర చేసేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఆయ‌న ప్రెసిడెంట్ అయిన‌ప్ప‌టి నుంచి నేరుగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు. ఇది ఆయ‌న‌కు బాగానే ఇమేజ్ తీసుకువ‌స్తోంది.

 

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఇక ఇప్పుడు ఆయ‌న జిల్లాల‌పై ఫోక‌స్ పెట్టారు. ఏయే జిల్లాల్లో త‌మ పార్టీ వీక్ గా ఉందో వాటిపై ఫోక‌స్ పెట్టి ఇంత‌కుముందు త‌మ పార్టీలో ప‌నిచేసి ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న వారిని తిరిగి కాంగ్రెస్ గూటికి ర‌ప్పించేందుకు రెడీ అవుతున్నారు రేవంత్‌. ఇక ఇప్ప‌టికే టీఆర్ ఎస్ నుంచి కొంద‌రిని త‌మ పార్టీలో చేర్చుకునేందుకు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఖ‌మ్మం జిల్లాపై ఫోక‌స్ పెట్టిన రేవంత్ ఇందుకు సీత‌క్క‌ను రంగంలోకి దింపారు. అయితే సీత‌క్క రీసెంట్ గా ఈ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ సెకండ్ గ్రేడ్ లీడ‌ర్ల‌తో ర‌హ‌స్య బేటీ అయిన‌ట్టు స‌మాచారం.

దీంతో టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు సీత‌క్క భేటీ అయిన‌ట్టు తెలుసుకున్న జిల్లా గులాబీ నేత‌లు అల‌ర్ట్ అయి వారెవ‌రో తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు. కాగా ప్ర‌ముఖంగా కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ బట్టా విజయగాంధీ పేరు బ‌లంగా వినిపించింది. ఆయ‌న సీత‌క్క‌తో ర‌హ‌స్యంగా కొంత మందిని తీసుకుని వెల్లి మీట్ అయిన‌ట్టు తెలుసుకున్న ఆయ‌న్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఖ‌మ్మంలో పెద్ద దుమార‌మే రేగింది. ఇక ఈయ‌న‌తో పాటు మ‌రి కొంద‌రు కూడా ఉన్నార‌ని త్వ‌ర‌లోనే వారిని కూడా తీసేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది.