షర్మిలపై నివేదిక రెడీ చేసిన రేవంత్…?

-

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే వైయస్ షర్మిల ను ఎదుర్కొని నిలబడాలనే వ్యాఖ్యలు కొత్తగా వినపడుతున్నాయి. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ను విమర్శించే విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భయ పడుతూ వచ్చారు. షర్మిల మాత్రం కేసీఆర్ను టార్గెట్ చేయటంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఇప్పుడు షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఒక నివేదిక కేంద్ర నాయకత్వానికి పంపించినట్టు గా సమాచారం. షర్మిల సభకు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల సహకారం అందించారని రేవంత్ రెడ్డి గుర్తించారు. ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించిన కొంత మంది నేతలు ఆమెతో సమావేశమై అన్ని విధాలుగా కూడా సహకరించారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించి రేవంత్ ఒక నివేదిక తయారు చేసి ఇప్పటికే కేంద్ర నాయకత్వాన్ని కూడా పంపించినట్టు గా కేంద్ర నాయకత్వం కూడా దీన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం .మూడు రోజుల క్రితమే ఈ నివేదికను రేవంత్ రెడ్డి పంపించారని నాగార్జునసాగర్ ఎన్నికల్లో పనిచేసే నేతలు కూడా షర్మిలకు సహకరించారు అనే అంశాన్ని రేవంత్ రెడ్డి కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్లారని సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా షర్మిలకు పూర్తి స్థాయి లో సహకారం అందిస్తున్నారని మాజీ ఎంపీలు కూడా కొంతమంది ఆమె వైపు చూస్తున్నారు అని రేవంత్ రెడ్డి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news