బండికి రేవంత్ ఛాన్స్ ఇవ్వడం లేదా?

-

తెలంగాణలో ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా పుంజుకున్న ప్రతిపక్షాలు, టీఆర్ఎస్ టార్గెట్‌గా ముందుకెళుతున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్‌ని పక్కనబెడితే ప్రతిపక్ష పార్టీలు సైతం గట్టిగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్-బీజేపీలు సెకండ్ ప్లేస్‌ కోసం గట్టిగానే పోరాడుతున్నాయి.మామూలుగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తర్వాత బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీనే. కానీ మధ్యలో బీజేపీ పుంజుకుని, దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టింది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని దాదాపు ఓడించినంత పని చేసింది. అటు బీజేపీ అధ్యక్షుడు సైతం నిత్యం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చేది బీజేపీనే అని అంతా అనుకున్నారు.

bandi sanjay kumar revanth reddy
bandi sanjay kumar revanth reddy

కానీ ఊహించని విధంగా టీపీసీసీ పగ్గాలు తీసుకున్న రేవంత్ రెడ్డి, బీజేపీని వెనక్కినెట్టి కాంగ్రెస్‌ని రేసులోకి తీసుకొచ్చారు. బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్‌నే కేసీఆర్‌కు ప్రత్యామ్నాయమని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బీజేపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్ చేసి పోరాటం చేశారు. ఈ అంశంలో బీజేపీ ఎలాగో పోరాటం చేయలేదో కాబట్టి, రేవంత్‌కు మంచి మార్కులు పడినట్లు కనిపిస్తున్నాయి.

అయితే కోకాపేట ప్రభుత్వ భూముల వేలంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని కేసీఆర్ బంధువులు, సన్నిహితులే ఆ భూములని వేలంలో కొనుక్కున్నారని చెబుతున్నారు. దీని బట్టి చూస్తే ఇలాంటి అంశాల్లో రేవంత్ వెళుతున్నంత దూకుడుగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్ళడం లేదని తెలుస్తోంది. ఏ సమస్య అయినా మొదట రేవంత్ రెడ్డి స్పందిస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news