ఆ విష‌యంలో కేసీఆర్ ను ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి.. గ‌ట్టెక్కుతాడా..?

రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ప‌క్కా ప్లాన్ వేసి మ‌రీ తాను అనుకున్న‌ట్టుగానే కాంగ్రెస్ ప‌గ్గాల‌ను త‌న చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇక దాంతో ప్ర‌తి విష‌యాన్ని కూడా చాలా జాగ్ర‌త్త‌గా, ప‌క్కాగా ఆలోచించి మ‌రీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌లాగే వాస్తు మార్పుల‌ను న‌మ్ముకుంటున్నారు. ఇప్ప‌టికే గాంధీ భ‌వ‌న్‌లో చ‌లా వ‌ర‌కు వాస్తుప‌ర‌మైన మార్పుల‌ను చేయించి త‌న రూమ్‌ను డెక‌రేట్ చేయించారు.

ఎందుకంటే త‌న‌కంటే ముందు పార్టీని న‌డిపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తూర్పు మూలలో ఉన్న రెండో గదిలో కార్య‌క‌లాపాలు చేయ‌డంతో పార్టీ మొత్తం న‌ష్ట‌పోయింద‌ని రేవంత్ భావించారు. ఉత్త‌మ్ హ‌యాంలో పార్టీ ఎంత‌లా ప్ర‌జ‌ల్లో క‌నుమ‌రుగైందో ఎంత‌లా దారుణంగా దిగజారి పోయింద‌నే చెప్పాల్సిన ప‌నిలేద‌ని తెలుస్తోంది.

కాబ‌ట్టి ఆ రూమ్‌ను అలాగే ఉంచితే ప్ర‌మాద‌మ‌ని రేవంత్ భావించి వాస్తు నిపుణుల స‌ల‌హా మేర‌కు త‌న అదృష్టగది అయిన కొత్త రూమ్‌ను సెలెక్ట్ చేసుకుని మ‌రీ అందులో నుంచే త‌న కార్య‌క‌లాపాలు నిర్వ‌ర్తించేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ ప‌క్కాగా ప్లాన్ చేసుకుటున్నారని తెలుస్తోంది. ఇక ఈ గ‌దికి వెళ్లేందుకు కొత్తగా తూర్పు ద్వారాన్ని తెరిపించి మ‌రీ దాని నుంచే వెళ్లేందుకు రేవంంత్ ప్లాన్ చేస్తున్నారు. అచ్చం కేసీఆర్ లాగే వాస్తు మార్పుల‌ను చేస్తున్న రేవంత్ మ‌రి రాబోయే కాలంలో పార్టీని అధికారంలోకి తెస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి.