ర‌బీ, ఖ‌రీఫ్ బియ్యం ఎంత ఇచ్చినా తీసుకుంటం : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రం నుంచి ర‌బీ, ఖ‌రీఫ్ సీజ‌న్ల నుంచి ఎంత వ‌రి ధాన్యం ఇచ్చిన తీసుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధం గా ఉంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం గత రబీ సీజన్లో పండిన వరిధాన్యం సేకరణ జరుగుతుంద‌ని అన్నారు. అలాగే రాబోయే ఖరీఫ్ సీజన్ బియ్యం సేకరణ వచ్చే జనవరి నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం రబీ, ఖరీఫ్ లో ఎంత ముడి బియ్యం ఇచ్చినా తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) కి ఇవ్వాల్సిన బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేతగానితనం వల్ల గత రబీ టార్గెట్ ఇంతవరకు పూర్తి చేయలేదని విమ‌ర్శించారు. భవిష్యత్ లో బాయిల్డ్ రైస్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వమే లిఖితపూర్వకంగా ఒప్పుకుందని గుర్తు చేశారు. అలాగే ధాన్యం సేకరణ మొత్తం ఖర్చు కేంద్రానిదే అని అన్నారు. కేంద్రంపై కేసిఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమ‌ర్శించారు. రాష్ట్రంలో హుజూరబాద్ ఓటమి తర్వాత, ముఖ్యమంత్రి కెసిఆర్ బియ్యం అంశాన్ని ఎత్తుకున్నారని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news