నిజానికి రోజా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆమెకు మంత్రి పదవి ఖాయం. హోంమంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే.. రోజా గెలిస్తే తమకు మంత్రి పదవులు దక్కవని.. వైఎస్సార్సీపీ నేతలే రోజా ఓటమికి వ్యూహాలను రచించారట.
చిత్తూరు జిల్లా నగరి నుంచి వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసిన రోజా ఖచ్చితంగా ఓడిపోతారని ఇటీవలే ఆరా అనే సర్వే సంస్థ తెలిపింది కదా. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెబుతున్నాయి. నగరిలో రోజా ఓడిపోబోతున్నారట. ఒక్క రోజానే కాదు.. ఏపీలోని ప్రముఖులు చాలామంది ఓడిపోబోతున్నారట. దీంతో ఏపీలో రాజకీయ వేడి రగులుకుంది.
లగడపాటి సర్వే అదే తేల్చింది.. ఆరా సంస్థ కూడా అదే తేల్చింది. నిజానికి రోజా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆమెకు మంత్రి పదవి ఖాయం. హోంమంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే.. రోజా గెలిస్తే తమకు మంత్రి పదవులు దక్కవని.. వైఎస్సార్సీపీ నేతలే రోజా ఓటమికి వ్యూహాలను రచించారట. ఆమె ఓడిపోయేటట్టుగా చేశారని తెలుస్తోంది. రోజాకు నగరిలో ఫాలోయింగ్ బాగానే ఉంది. 2014లో కూడా ఆమె వైఎస్సార్సీపీ తరుపున నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ఈసారి కూడా ఆమె గెలిస్తే.. లేడీ కోటాలో ఖచ్చితంగా ఆమెకే మంత్రి పదవి పోతుందని.. దీంతో తమ మంత్రి పదవి కలేనని అనుకున్న చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు.. ఆమెను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించారట. వాళ్ల ప్రయత్నాలు ఫలించినట్టేనని.. ఎగ్జిట్ పోల్స్ కూడా చెబుతున్నాయి.
ఒకవేళ నగరి నుంచి రోజా ఓడిపోయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినా.. రోజాకు మంత్రి పదవి ఖాయమని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరు నెలల్లో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించి అయినా మంత్రిగా కొనసాగించాలని జగన్ అనుకుంటున్నట్టు సమాచారం. వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్ కావడం, ప్రత్యర్థులను ఇట్టే మాటలతో ఓడించడం, ఏకధాటిగా మాట్లాడటం, భయం, బెరుకు లేకపోవడం, రాజకీయాల గురించి అవగాహన ఉండటం, సెలబ్రిటీ కావడం, తెలుగు రాష్ట్రాల్లో కాస్తోకూస్తో ఫాలోయింగ్ ఉండటం.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వైఎస్ జగన్.. ఆమె ఓడిపోయినా.. గెలిచినా మంత్రి పదవి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు.. అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో తెలియాలంటే మే 23 దాకా ఆగాల్సిందే.