మంగళగిరి ప్రజలు అటు చంద్రబాబును కానీ.. ఇటు లోకేశ్ బాబును కానీ నమ్మలేదా? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.
అయ్యో.. అయ్యయ్యో… ఎంత పని జరిగినే… టీడీపీ గెలవకున్నా ఏం బాధ లేదు కానీ.. మంగళగిరిలో మాత్రం తన కొడుకు నారా లోకేశ్ గెలవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నో కలలు కన్నారు. ఎలాగైనా తన కొడుకు ఎమ్మెల్యే కావాలని రాత్రీపగలు శ్రమించారు. దాని కోసం ఎంతో ఖర్చు చేశారు. కోట్లకు కోట్లే మంగళగిరికి తరలివెళ్లాయి. ఎన్నో బూటకపు హామీలు. అయినా కూడా మంగళగిరి ప్రజలు అటు చంద్రబాబును కానీ.. ఇటు లోకేశ్ బాబును కానీ నమ్మలేదా? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.
అవును.. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేశ్ బాబు ఓడిపోతారని చెప్పేశాయి. లోకేశ్ బాబును మంగళగిరి ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారట.
ఆరా అనే సంస్థ నిర్వహించిన సర్వేతో పాటు పలు ఇతర సర్వేల్లోనూ ఇదే తేలింది. లోకేశ్ మంగళగిరిలో గెలవడం కష్టమే అని ఆరా సంస్థ తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి బీజేపీ, పవన్ కల్యాణే కారణమని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. ఆరా సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో వైసీపీకి 135 సీట్లు వస్తాయట. 119 నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందట.