వినేవాడు ఏదో అయితే చెప్పేవాడు సబ్బం హరి!

వినేవాడు ఏదో అయితే అన్న చందంగా సాగుతుంటుంది పసుపు ఛానల్స్ లో సబ్బం హరి ప్రసంగాల పర్వం! విశాఖ ప్రవక్త గా పేరుగాంచిన సబ్బం హరి తాజాగా మరోసారి జమిలీ ఎన్నికలు, జగన్ జైలు, నెక్స్ట్ ఏపీ సీఎం వంటి అంశాలపై తనదైన ప్రసంగాలు చేశారు! తనకు అన్నీ తెలుసు, తాను అన్నవన్నీ జరిగిపోతాయి అనేది చెప్పాలనే తాపత్రయమో లేక పసుపు మైండ్ గేం లో భాగమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆ దిశగా ముందుకు పోతున్నారు.

అవును… తాజాగా ఒక ప్రముఖ పసుపు టీవీ ఛానల్ లో ప్రసంగించిన సబ్బం హరి… “రాష్ట్రంలో 2021 చివరిలో గానీ, 2022 మధ్యలో గానీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆ సమయానికి ప్రభుత్వంలో జగన్‌ ఉండడు.. ఇప్పటికిప్పుడు ఏదైనా జరిగితే భార్య భారతిని, ఆలస్యమైతే తల్లి విజయలక్ష్మిని ముఖ్యమంత్రిని చేస్తారరు.. ఏదిఏమైనా 2022 నాటికి దేశంలో జమిలి ఎన్నికలు జరగడం ఖాయం” అని చెప్పుకొచ్చారు!

ఇక్కడ సబ్బం హరి మాట్లాడిన వాటిలో ముఖ్యంగా ఎన్నికల సంగతే తీసుకుంటే… మరో సంవత్సర కాలం దాటితే ఎన్నికలు రావొచ్చని! ఆ విషయంలో జగన్ కి ఉన్న ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు! ప్రస్తుతం ఏపీలోని జనాల్లో జగన్ కు అలా ఉంది! మరి టీడీపీ పరిస్థితి ఏమిటి? నిజంగా వెంటనే ఎన్నికలు వచ్చేస్తే… జమిలీకి బాబు & కో రెడీ అవుతారా? సబ్బం కే తెలియాలి! ఈ విషయాలు బాబుకి కూడా ప్రత్యేకంగా చెప్పి జాగ్రత్తపరచాలని కోరుకుంటున్నారు అభిమానులు!