ఇప్పటి వరకు షర్మిల Sharmila తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా కేసీఆర్ పైనే విమర్శలు చేస్తూ వస్తోంది. అంతే కాదు ఇతర పార్టీలపై పెద్దగా ఫోకస్ పెట్టకుండా కేవలం ప్రజా సమస్యలపై తన తండ్రి తీసుకొచ్చిన పథకాలపైనే మాట్లాడుతోంది. అంతే కాదు తన తండ్రి అభిమానులనే సైన్యంగా చేసుకుని ముందుకెళ్తోంది. ఇదే క్రమంలో ఆమె మరోసారి విమర్శల దాడి చేసింది.
ఇక రీసెంట్గా అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం రోజున ఆమెకు నెటిజన్లు అందరూ వైఎస్ తెలిపారు. ఈ క్రమంలో షర్మిల స్పందిస్తూ తాను సోషల్ మీడియా బిడ్డనని, తనకు వైఎస్ అభిమానులే కార్యకర్తలంటూ చెప్పింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లాగా తనకు సోషల్ మీడియా ఉద్యోగులు లేరంది.
ఇక తనకు అండగా ఉంటున్న రెడ్డి సామాజిక సంఘాల నేతలు ఒక్కసారిగా రేవంత్‌కు టీపీసీ ప్రెసిడెంట్ కావడంతో ఆయనవైపు మళ్లారు. దీంతో షర్మిల రేవంత్‌ను కూడా విమర్శల దాడి చేసింది. టీడీపీకి చెందిన నాయకుడిని తెచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్‌గా నియమించారని ఎద్దేవా చేసింది. కాగా ఆమె సెటైర్ల వెనక తన సామాజిక వర్గం నేతలు చేజారిపోతారనే భయం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.