రాజకీయాల్లో పాదయాత్ర అనేది నాయకుల సక్సెస్ ఫార్ములా అని చెప్పొచ్చు. పాదయాత్ర చేసిన నాయకులు ప్రజలకు మరింత దగ్గరవుతారు. దాని వల్ల ఎన్నికల్లో వారికి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. 2004 ఎన్నికల ముందు ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ బాగా స్ట్రాంగ్ గా ఉంది. అప్పుడు సీఎంగా చంద్రబాబు దూసుకుపోతున్నారు. అప్పుడు సీన్ చేసి…అసలు చంద్రబాబుకు చెక్ పెట్టలేమని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు భావించారు. కానీ ఒక్క వైఎస్సార్ మాత్రం దూకుడు కనబర్చారు. ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. వారి బాధలు తెలుసుకున్నారు..వారికి అండగా నిలబడ్డారు. అందుకే 2004 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌కు అండగా కాంగ్రెస్‌ని భారీ మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు.
ఒకవేళ పాదయాత్ర చేయకపోతే పరిస్తితి మరొకలా ఉండేదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత అంటే 2014 ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేశారు. ఆయనకు పోటీగా వైసీపీకి మద్ధతుగా వైఎస్సార్ తనయురాలు షర్మిల పాదయాత్ర చేశారు. కానీ రాష్ట్ర విభజనతో ఏపీలో చంద్రబాబుకు ప్లస్ అయింది. ఏపీలో ఆయన అధికారంలోకి వచ్చారు.
ఇక 2019 ఎన్నికల ముందు ఏపీలో జగన్ పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చేశారు. కానీ తెలంగాణలో పాదయాత్రలు మొన్నటివరకు ఏ ప్రతిపక్ష నాయకులు చేయలేదు. ఇటీవలే బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పాయాత్ర చేశారు. విడతల వారీగా బండి పాదయాత్ర జరగనుంది. ఇదే సమయంలో తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తానని వైఎస్సార్టీపీ పార్టీ పెట్టిన్ షర్మిల కూడా పాదయాత్రకు సిద్ధమైంది.
తన తండ్రి నిర్వహించిన విధంగానే ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర మొదలుపెట్టనున్నారు…వైఎస్సార్ మాదిరిగానే చేవెళ్లలో పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ నెల 20న ముహూర్తం ఖరారైంది. ఇక షర్మిల పాదయాత్ర మోతమ్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం డైరక్షన్‌లో జరగనుంది. ఏకంగా 400 రోజుల పాటు 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగనుంది…రూట్ మ్యాప్, ఎక్కడ ఎలా మాట్లాడాలే అని ప్రతిదీ పీకీ టీం డైర్క్షన్‌లో నడవనుంది.
2019 ఎన్నికల ముందు ఏపీలో పీకే డైరక్షన్‌లోనే జగన్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. అలాగే ఎక్కడ ఎలా మాట్లాడాలనే స్క్రిప్ట్‌లు కూడా వారే ఇచ్చారు. అయితే పీకే వ్యూహాలతోనే జగన్ అధికారంలోకి వచ్చారు..మరి జగన్ మాదిరిగానే ఆయన సోదరి షర్మిల కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తారేమో చూడాలి.