ఈట‌ల రాజేంద‌ర్‌ను ఆహ్వానించిన‌ ష‌ర్మిల‌.. ఇప్ప‌టికి గుర్తొచ్చారా!

ఈట‌ల రాజేంద‌ర్ (Etela Rajender) వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న ఏ పార్టీలో చేర‌తారంటూ అనేక చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇక ఆయ‌న‌ను ఎలాగైనా త‌మ పార్టీల్లో చేర్చుకోవాల‌ని అన్ని పార్టీలూ విశ్వ ప్ర‌య‌త్నాలు చేశాయి. కానీ చివ‌ర‌కు ఆయ‌న బీజేపీకి జై కొట్టిన విష‌యం తెలిసిందే.
బీసీల్లో బ‌ల‌మైన నాయ‌కుడిగా, రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప‌ట్టున్న నేత‌గా ఈట‌ల పేరు తెచ్చుకున్నారు.

 

ఈ కార‌ణంగానే ఆయ‌న‌కు అన్ని పార్టీలూ పెద్ద పీఠ వేసేందుకు ప్ర‌య‌త్నించాయి. ఇక కాంగ్రెస్ ముఖ్య నేత‌లు అయితే బ‌హిరంగంగానే ఈట‌ల రాజేందర్ త‌మ పార్టీలోకి వ‌స్తే బాగుంటుంద‌ని ఆఫ‌ర్లు కూడా ప్ర‌క‌టించాయి. ఇక్క‌డ ట్విస్టు ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు వైఎస్‌ష‌ర్మిల‌.

కానీ ఈరోజు అనూహ్యంగా ఈట‌ల రాజేంద‌ర్‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానించారు ష‌ర్మిల‌. బీజేపీ వైపు వెళ్లొద్ద‌ని, త‌మ పార్టీలోకి రావాల‌ని కోరారు. కానీ అంతా అయిపోయాక ష‌ర్మిల మేలుకున్నారా అని చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు. ఆల్రెడీ ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయ‌మైపోయింది. ఇలాంటి టైమ్‌లో ఆయ‌న్ను ఆహ్వానించ‌డం ఏంటంటూ అంతా అనుకుంటున్నారు. కానీ ష‌ర్మిల ఇదే ఆఫ‌ర్ ముందే ఇచ్చి ఉంటే ఏదైనా ఫ‌లితం ఉండేద‌ని భావిస్తున్నారు ఆమె కార్య‌క‌ర్త‌లు.