షర్మిల దూకుడు..బెనిఫిట్ ఎవరికి?

-

తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాలు బాగా దూకుడుగా ముందుకెళుతున్నాయి..ఇంతకాలం అధికార టీఆర్ఎస్ హవానే పూర్తిగా కొనసాగింది..కానీ కొంతకాలం నుంచి ప్రతిపక్షాలు పుంజుకోవడం మొదలైంది..ఊహించని విధంగా బీజేపీ పుంజుకోవడం..అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చింది..దీంతో టీఆర్ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు తమకు తిరుగులేదనే విధంగా టీఆర్ఎస్ రాజకీయం చేసింది..కానీ ఎప్పుడైతే ప్రతిపక్షాలు పూనుకున్నాయో..అప్పటి నుంచి సీన్ మారిపోయింది.

అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఇదే క్రమంలో దివంగత వైఎస్సార్ తనయురాలు షర్మిల సైతం…తెలంగాణలో కొత్త పార్టీ రాజకీయం చేస్తున్నారు. వైఎస్సార్టీపీ పేరిట పార్టీ నడుపుతున్న విషయం తెలిసిందే. ఇక షర్మిల పార్టీ ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అనుకున్న మేర షర్మిల..తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటలేకపోతున్నారు…ఏదో నామ మాత్రంగానే ఆ పార్టీ ఉంది.

కాకపోతే ఆమె టీఆర్ఎస్ పార్టీపై నిత్యం విమర్శలు చేస్తూనే వస్తున్నారు…తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని సమస్యలపై గళం విప్పుతున్నారు…అలాగే కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. అయితే షర్మిల ఎన్ని విమర్శలు చేసిన టీఆర్ఎస్ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో షర్మిల పెద్దగా హైలైట్ అవ్వలేకపోతున్నారు. కానీ ఇటీవల ఆమె మరింత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాపై ఆమె ఫోకస్ చేశారు. ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

అందుకే ఆమె ఖమ్మంలోనే ఎక్కువ రాజకీయం నడుపుతున్నారు..ఇదే క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు…ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. అటు పువ్వాడ సైతం షర్మిలకు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి షర్మిల సైతం రేసులో ఉన్నారని తెలుస్తోంది. అయితే షర్మిల పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదని అర్ధమవుతుంది. కానీ ఆ పార్టీ వల్ల టీఆర్ఎస్ కు పెద్ద నష్టం జరగదు…అదే సమయంలో కాంగ్రెస్ కు కాస్త నష్టం జరిగేలా ఉంది…పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి బెనిఫిట్ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news