షర్మిల హైలైట్..ఇదే స్ట్రాటజీ..!

-

తెలంగాణలో హైలైట్ అవ్వడానికి వైఎస్ షర్మిల బాగా కష్టపడుతున్నారు..రాష్ట్రంలో తన పార్టీ కూడా ఒకటి ఉందని ప్రజలకు తెలిసేలా చేయడానికి షర్మిల అనేక మార్గాల్లో రాజకీయం నడిపిస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు..ఆ పార్టీ బాగా హైలైట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. పైగా షర్మిల పాదయాత్ర చేసిన పెద్దగా హైలైట్ కాలేదు. అయితే ఊహించని విధంగా షర్మిల..ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ..స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు టార్గెట్‌గా విమర్శలు చేస్తూ వస్తున్నారు.

విమర్శలు కూడా దాటేసి..వ్యక్తిగతంగా తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. అప్పుడు అపోజిట్ నాయకులు స్పందించి తనని తిడితే తమ పార్టీ హైలైట్ అవుతుంది..తాను కూడా తెలంగాణలో రేసులో ఉన్నానని అనిపించుకోవడానికి షర్మిల ఈ రకమైన రాజకీయంతో ముందుకొచ్చినట్లు అర్ధమవుతుంది. ఎప్పుడైతే ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళి అక్కడ మంత్రి పువ్వాడ అజయ్…అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల లక్ష్యంగా విరుచుకుపడ్డారు. వారు కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు.

ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో..మంత్రి నిరంజన్ రెడ్డిని గట్టిగా టార్గెట్ చేశారు. ఏ ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేని వదలలేదు. వారు కూడా షర్మిలపై రివర్స్‌లో విరుచుకుపడ్డారు. ఆమెపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసేవరకు కథ వచ్చింది. నెక్స్ట్ సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్‌ని చేశారు. దీంతో కొన్ని రోజులు షర్మిల వర్సెస్ జగ్గారెడ్డి అన్నట్లు వార్ నడిచింది.

ఇటీవల ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ని టార్గెట్ చేశారు..దీంతో ఆయన అనుచరులు షర్మిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఇలా షర్మిల..ఎమ్మెల్యేలని, మంత్రులని టార్గెట్ చేసి తిట్టడం, తనని తిట్టేలా చేసుకుంటున్నారు. ఇలా చేస్తే రాజకీయంగా హైలైట్ అయ్యే అవకాశం ఉండనే విధంగా ఆమె ముందుకెళుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆస్తులపై నేరుగా సీబీఐ, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇలా చేస్తే మళ్ళీ టీఆర్ఎస్..తనని గట్టిగా టార్గెట్ చేస్తారని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హైలైట్ అవ్వడానికి బాగానే కష్టపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news