తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కేసీఆర్‌పై ఘాటువిమర్శలు చేస్తున్నారు షర్మిల. ముఖ్యంగా నిరుద్యోగలు సమస్యలను బేస్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి, ఆ తర్వాత నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష.. ఇలా వరుసగా హంగామా చేశారు. కానీ కరోనా కారణంగా పెద్దగా బయట తిరగట్లేదు. కానీ ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మెదక్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగుల ప్రాణాలతో ఆడుకోవద్దని, వెంటనే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. అలాగే ఆయుష్మాన్ భారత్‌ను తిట్టిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అలాగే కరోనాను ఆరోగ్యశ్రీ లో ఎందుకు చేర్చట్లేదని ప్రశ్నించారు.
అయితే ఈ పాయింట్ నిజానికి బీజేపీ వాడుకోవాలి. కానీ వారు దీనిపై సైలెంట్‌గా ఉన్నారు. కానీ షర్మిల మాత్రం బాగానే వాడుకుందంటూ రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇంకోవైపు ఆరోగ్యశ్రీపై బీజేపీ, కాంగ్రెస్ ల కంటే కంటే షర్మిలనే ఎక్కువగా మాట్లాడుతూ ప్రజల్లో సానుభూతి పెంచుకుంటోంది. మొత్తానికి సమయానికి తగ్గట్టు విమర్శలు బాగానే చేస్తోంది షర్మిల.