10 మందితో ఆరో జాబితా…కొత్త సమన్వయకర్తలు వీళ్ళే

-

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించలనే లక్ష్యంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేగంగా పార్టీలో మార్పులు చేస్తున్నారు.తన సర్వే ప్రకారం అభ్యర్థులను మారుస్తున్నారు.ఇదే క్రమంలో పది మందితో కూడిన 6వ లిస్ట్ ను సీఎం ఖరారు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నారు.మరో 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌ లను ప్రకటించారు.

నాలుగు లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలు
– రాజమహేంద్రవరం – గూడూరి శ్రీనివాస్‌
– నర్సాపురం – అడ్వకేట్‌ గూడూరి ఉమాబాల
– గుంటూరు – ఉమ్మారెడ్డి వెంకటరమణ
– చిత్తూరు (ఎస్సీ) – ఎన్‌.రెడ్డప్ప

ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్ లు
– మైలవరం – తిరుపతిరావు యాదవ్‌
– మార్కాపురం – అన్నా రాంబాబు
– గిద్దలూరు – కె. నాగార్జున రెడ్డి
– నెల్లూరు సిటీ – ఎండీ. ఖలీల్‌ (డిప్యూటీ మేయర్‌)
– జీడీ. నెల్లూరు – కె.నారాయణస్వామి
– ఎమ్మిగనూరు – బుట్టా రేణుక

నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నరసాపురం పార్లమెంట్ కి పంపిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా నెల్లూరు నగరానికి డిప్యూటీ మేయర్ ఖలీల్‌ను నియమించడం వెనుక పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. కేడర్ లేనటువంటి వ్యక్తికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం సాహసమేనని అంటున్నారు. ఎమ్మెల్యే అనిల్ ప్లేస్ మారడంతో తదుపరి ఇంచార్జ్ విషయంలో అనేక పేర్లు వినిపించాయి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, నుడ చైర్మన్ ముక్కాల ద్వారాకనాథ్,మరో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వంటి పేర్లు తెరమీదికి వచ్చాయి.అయితే ఎవరూ ఊహించని వ్యక్తికి సీఎం పగ్గాలు అప్పగించారు. ఈ పరిణామం నెల్లూరులో చర్చనీయాంశంగా మారింది.

ఇక జాబితాల విషయానికొస్తే….తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ నిర్ణయించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను ఏర్పాటు చేశారు.6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా ఇచ్చేశారు.ఇక 7వ జాబితాలో ఎవరెవరు ఉంటారోనని ఆశావహులు ఉత్కంఠంగా చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news