ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య మందు (Anandayya Medicine) గురించి ఎంత పెద్ద చర్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. చాలామంది ఆయన మందుకు మద్దతు తెలుపుతున్నారు. మరి కొందరేమో వాడొద్దంటూ వాదిస్తున్నారు. కానీ ఫైనల్‌గా ఆయన మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ మందుపై మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆ మందును బ్లాక్ అమ్మి కోట్లు సంపాదించేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఓ వెబ్ సైట్ ద్వారా వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నాటు మందును అమ్మేందుక ప్లాన్ చేస్తున్నాడంటూ ఆరోపించారు.
దీనిపై ఎమ్మెల్యే కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తనకు ఎలాంటి అసవరం లేదని, టీడీపీ కావాలని రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఇక మాజీ మంత్రి ఆరోపణలపై సదురు వెబ్ సైట్ శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మాదరెడ్డి ఏకంగా పోలీస్ కేసు పెట్టారు. దీంతో సోమిరెడ్డిపై చీటింగ్ ఫోర్జరీ దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో నెల్లూరు జిల్లా అట్టుడికిపోతోంది. దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే ఆనందయ్య మాత్రం తనను రాజకీయాల్లోకి లాగొద్దని కోరుతున్నారు.