రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సోము…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సింహాల ప్రతిమలు కనపడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అమ్మవారి ఆలయంలో ఉన్న రథానికి అధిక ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రథాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని చెప్పారు.

ఈ రథం ఖరీదు 15 లక్షలని… ప్రస్తుతం రథంలో సింహాలు ఒకటే ఉందన్నారు. రథానికి ఉన్న ఒక సింహం బొమ్మ బ్రేక్ చేసిన విధంగా ఉందని చెప్పారు. ఇది ఆలయానికి సంబంధించిన సిబ్బంది నిర్లక్ష్యమని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనే చోట్ల జరుగుతున్నాయని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ఇప్పటికయినా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి భాద్యుల పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు