సోనియాగాంధీ vs చంద్రబాబు నాయుడు ఒకరు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత. ఇటువంటి కీలక సమయంలో కరోనా వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 21 రోజులు లాక్ డౌన్ నిర్ణయం భేష్ అంటూ నరేంద్రమోడికి లెటర్ ద్వారా సోనియాగాంధీ తెలియజేశారు. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కలసి పోరాడాలని సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు కలసి కరోనా వైరస్ పై పోరాటం అని సోనియాగాంధీ పిలుపు ఇవ్వడం జరిగింది.ఇదే టైమ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం ఇటువంటి కీలకమైన టైంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ఆ సమయంలో రాజకీయాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాడని అధికార పార్టీ నేతలు విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో బాధ్యతగా వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కొట్టమని ఏర్పాటు చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఆరోపణలు, విమర్శలు చేస్తు ఉండటం సిగ్గుచేటు అన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోను తప్పులే వెతుకుతూ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి. హఠాత్తుగా ఇటీవల రాత్రి వేలాది మంది ఏపి-తెలంగాణా సరిహద్దుల్లోని జగ్గయ్యపేట దగ్గరకు వచ్చేస్తే దాన్ని కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ఏపి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాడు. ఇదే టైమ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డు ఏర్పాటు చేస్తుంటే ఎంపీ కేశినేని అడ్డుకోవటం సిగ్గుచేటు అంటూ సోనియా గాంధీని చూసుకుని చంద్రబాబు చాలా నేర్చుకోవాలని విమర్శలు చేస్తున్నారు.