బీజేపీలో కన్నాకి పొగబెడుతున్నారా ?

Join Our COmmunity

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పార్టీలో పొగ పెడుతున్నారా ? బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా అని ఏదో ఒక సందర్భంలో ఇటు సొంత పార్టీలోనూ.. అటు ప్రత్యర్థి పార్టీలోనూ చర్చ జరుగుతోంది. వాస్తవం ఏంటంటే.. కన్నా బీజేపీకి రాజీనామా చేయలేదు. పార్టీ మారే ఆలోచనలోనూ లేరని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయినప్పటికీ బీజేపీకి కన్నా రాజీనామా అన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు. కన్నా రాజీనామా అని పొలిటికల్‌ సర్కిల్స్‌లో ప్రచారం చేస్తోంది ఎవరు అన్నదానిపై ఏపీ బీజేపీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా వైదొలిగిన రోజు నుంచి ఆయన పై పార్టీలో భిన్నమైన ప్రచారమే నడుస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలో సరైన ప్రాతినిథ్యం లభించని వారు ఇప్పుడు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నట్టు భావిస్తున్నారట. ఇటీవల కన్నా ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. ఆయన అటు వెళ్లగానే ఇటు కన్నా రాజీనామా అన్న ప్రచారం మొదలైపోయింది. విషయం అర్థంకాక కన్నా అనుచరులు సైతం ఈ అంశంపై ఆరా తీశారట. పార్టీలో కన్నా అంటే గిట్టని వారు ఆడుతున్న మైండ్‌గేమ్‌గా అనుమానిస్తున్నారట.

కన్నా కంటే ముందు ఏపీ బీజేపీ చీఫ్‌ అవ్వాలని ఆశపడ్డారు సోము వీర్రాజు. కానీ ఆ ఆశ అప్పట్లో నెరవేరలేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఇద్దరు నేతలు కలిసి మెలిసి ఉన్నా.. వారి అనుచరులు మాత్రం ఎడముఖం పెడముఖంగానే ఉండేవారు. ప్రస్తుతం సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా.. రెండు వర్గాల మధ్య ఆ గ్యాప్‌ అలాగే ఉందని కమలం పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటాయి. ఇప్పుడు కన్నా విషయంలో జరుగుతున్న ప్రచారంలో ప్రత్యర్థివర్గం పాత్రను కొట్టిపారేయలేమన్నది మాజీ చీఫ్ అనుచరులు చెప్పే మాట.

కన్నాకు ఇప్పటికీ బీజేపీలో మంచి హోల్డ్‌ ఉందని.. ఢిల్లీ పెద్దలు కూడా ఆయన నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారనే టాక్‌ నడుస్తోంది. అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత కూడా కన్నా యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయినా కన్నా రాజీనామా అన్న ప్రచారం ఆగకపోవడం వెనక బయట వ్యక్తుల ప్రమేయం కూడా ఉండొచ్చని సందేహిస్తున్నారట. దీనిపై పార్టీ ముఖ్యనేతలకు సమాచారం ఉందని వారు నమ్ముతున్నారు.

అధికార పార్టీ నేతల హస్తం లేకుండా బీజేపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఈ తరహా ప్రచారం చేయలేరని అనుకుంటున్నారట. మరి.. ఈ ప్రచారాన్ని కన్నా ఎలా డీల్‌ చేస్తారో చూడాలి.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news