ఏపీలో స్టిక్కర్ల రజకీయం నడుస్తుంది. ఇంతకాలం వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు ఎక్కడపడితే అక్కడ వేయడం, అంటించడం చేశారు. ఇప్పుడు అదే తరహాలో చేస్తుంటే కొన్ని వర్గాల ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయి. వైసీపీ గెలిచాక..వైసీపీ రంగులు కనిపించిన ప్రతిదానికి వేశారు..అలాగే ప్రతి చోట జగన్ బొమ్మ ఉండేలా చూసుకున్నారు. ఆఖరికి పొలం డాక్యుమెంట్లు, పట్టాదార్ పాస్ బుక్‌లపై కూడా జగన్ బొమ్మ పెట్టిన పరిస్తితి.
ఇక ఇప్పుడు ప్రతి ఇంటికి జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్‌ని అంటించే పనిలో పడ్డారు.. జగనన్నే మా భవిష్యత్..మా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్ పెట్టుకుని ఉన్న స్టిక్కర్‌ని ప్రతి ఇంటి గోడపై అంటిస్తున్నారు. జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్ ప్రతి గోడపై పడుతుంది. అయితే రాష్ట్రంలో అందరూ వైసీపీని గాని, జగన్ ని గాని అభిమానించే వారు లేరనే చెప్పాలి. టిడిపి, జనసేన, బిజేపి, కాంగ్రెస్ ఇతర పార్టీలని అభిమానించే వారు ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్లకు కూడా జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్‌ని అంటిస్తే ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకోరు అనే చెప్పాలి.
అలాగే ప్రభుత్వ పథకాలు అందని వారు ఉన్నారు..మరి వారు ఒప్పుకుంటారా? పథకాలు తీసుకున్నా సరే పన్నుల భారం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారు ఒప్పుకుంటారా? అంటే కష్టమనే చెప్పాలి. ఇక వైసీపీని అభిమానించే వారి ఇళ్లకే స్టిక్కర్లు అంటించాలి.
అయితే వైసీపీ నేతలు, వాలంటీర్లు అందరి ఇళ్లకు స్టిక్కర్లు అంటించే పనిలో ఉన్నారు. దీంతో జనసేన సానుభూతి పరులు ఉన్న ఇళ్లకు జనసేన నేతలు వెళ్ళి..జగన్ స్టిక్కర్ ఉన్న చోటే..మాకు నమ్మకం లేదు జగన్.. మా నమ్మకం పవన్ అనే స్టిక్కర్ అంటిస్తున్నారు. ఇలా రెండు పార్టీలు పోటాపోటిగా స్టిక్కర్లు అంటించే పనిలో పడ్డారు.