కాసేపు కొన్ని కొన్ని విషయాలు పక్కన పెట్టి బిజెపి, వైసీపీ స్నేహం గురించి మాట్లాడుకుంటే ఈ రెండు పార్టీల మధ్య మంచి స్నేహం మనకు కనపడుతుంది. బిజెపిని పార్లమెంట్ లో వైసీపీ విమర్శించదు. బిజెపి వైసీపీని రాష్ట్రంలో ఇబ్బంది పెట్టదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని జగన్ రాష్ట్రంలో వ్యతిరేకించారు గాని పార్లమెంట్ లో కాదు. దీనికి తోడు ముఖేష్ అంబాని చెప్పిన వ్యక్తికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారు.
ఇది జరిగి రెండు వారాలు కూడా అవ్వడం లేదు. ముఖేష్ అంబాని బిజెపికి కావాల్సిన మనిషి. కాబట్టి ఆయనకు సీటు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపణలు చేస్తున్నా సరే వాస్తవం అది కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బిజెపి రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహ రావు ఎన్నికలను వాయిదా వెయ్యాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసారు.
ఆయనతో జగన్ ఫిర్యాదు చేయించారు అంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోవడం తో ఎన్నికలను వాయిదా వెయ్యాలని జగన్ భావించే ఆయనతో కేంద్రానికి ఫిర్యాదు చేయించారు అంటున్నారు. ఆ తర్వాత ఎన్నికలను వాయిదా వేసారు. జీవీఎల్ జగన్ కి అత్యంత సన్నిహిత వ్యక్తి. కేంద్రానికి జగన్ ని దగ్గర చేసింది ఆయనే. ఇక్కడ టీడీపీ ని ట్రాప్ లో వేయడానికి జగన్ ఈ వ్యూహం పన్నారు అంటున్నారు.
ఇదంతా టీడీపీ టార్గెట్ గా కేంద్రం, జగన్ ఆడుతున్న మైండ్ గేమ్ అని టీడీపీ నేతలకు అనుమానం వస్తుంది. కావాలని తమను డైవర్ట్ చేయడానికే ఎన్నికలను వాయిదా వేసారని, టీడీపీ ని దీని ద్వారా బద్నాం చేయవచ్చు అని జగన్ భావించారు. ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి భూములు సిద్దంగా లేవు. కాబట్టి వద్దని ఎన్నికల సంఘం తో చెప్పించడం జగన్ కి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. టీడీపీ అడ్డుకుంది అనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి కలిసి వచ్చే అంశం. లేకపోతే ఇంత పెద్ద నిర్ణయాన్ని అంత సులువగా ఏ విధంగా తీసుకుంటారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.