టీడీపీ ‘కథలు’: గన్నవరంలో కొడాలి…గుడివాడలో వంశీ!

-

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు టీడీపీ కంచుకోటలే…కానీ అది ఒక్కప్పుడు మాత్రమే..2014 ముందు వరకు గుడివాడ టీడీపీ కంచుకోట…ఆ తర్వాత నుంచి వైసీపీ వశం. ఎప్పుడైతే కొడాలి వైసీపీలోకి వచ్చారో..అప్పటినుంచి గుడివాడలో వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. అయితే ఇదంతా కొడాలి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.

ఇటు గన్నవరంలో 2019 వరకు టీడీపీ హవా నడిచింది..కానీ ఎప్పుడైతే టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ..వైసీపీ వైపుకు వచ్చారో అప్పటినుంచి గన్నవరంలో టీడీపీ బలం తగ్గింది. వంశీ దూకుడుతో గన్నవరంలో వైసీపీ బలపడింది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో గన్నవరం, గుడివాడల్లో వైసీపీ హవా నడిచేలా ఉంది. కానీ కొడాలి, వంశీలకు ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ చూస్తుంది..ఎలాగైనా వారిని ఓడించాలని ప్రయత్నాలు చేస్తుంది.

అందుకే తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని టీడీపీ వదులుకోవడం లేదు…వంశీ, కొడాలిపై తమదైన శైలిలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. కొడాలి…ఎప్పుడు చంద్రబాబు, పవన్ ని తిట్టడం వల్ల…ఆయనపై నెగిటివ్ పెరిగిందని, కొడాలి బూతులని సొంత పార్టీ వాళ్లే తట్టుకోలేకపోతున్నారని ఓ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే చంద్రబాబు భార్యపై చేసిన కామెంట్ల వల్ల వంశీకి బాగా నెగిటివ్ ఉందని, అలాగే గన్నవరంలో ఉన్న వైసీపీ వర్గాలు వైసీపీకి మైనస్ అవుతున్నాయని కథనాలు వేసింది.

అంటే టోటల్ గా కొడాలి, వంశీలపై వ్యతిరేకత ఉందని, వారు మళ్ళీ గెలవరని టీడీపీ అనుకూల మీడియా చెబుతుంది…అందుకే కొడాలి, వంశీలు స్ట్రాటజీ మార్చి…తమ నియోజకవర్గాలని మార్చుకోవాలని చూస్తున్నారట.

అంటే కొడాలి ఏమో గన్నవరంలో, వంశీ ఏమో గుడివాడలో పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయం అధినేత జగన్ కు చెప్పిన స్పందన రాలేదు..దీంతో ఏం చేసేది లేక…గన్నవరంలో వంశీ పోటీ చేస్తారని ఈ మధ్య జరిగిన ప్లీనరీ సమావేశంలో కొడాలి ప్రకటించారని, కానీ మనసులో మాత్రం నియోజకవర్గాలు మార్చుకోవాలని ఉందని చెప్పి టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది. అంటే కొడాలి, వంశీల మనసులో దూరి టీడీపీ అనుకూల మీడియా తెలుసుకుందా? అని వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. మొత్తానికైతే ఏదొక విధంగా కొడాలి, వంశీలని దెబ్బకొట్టడమే టీడీపీ టార్గెట్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news