నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ సముద్రఖని లుక్‌..

-

నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. అయితే.. గ్రామీణ నేపథ్యంలో పోలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమాతో, దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా అందాల భామ కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. మరో కథానాయికగా కేథరిన్ అలరించనున్న ఈ సినిమాలో, ‘రాజప్ప’గా సముద్రఖని ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆయన పాత్రకి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.

Samuthirakani as Rajappa in Macherla Niyojakavargam, character poster out-  Cinema express

నెరసిన జుట్టు .. గుబురు మీసాలుతో కాస్త వయసు మళ్లిన పాత్రలో .. ఊరికి పెద్దమనిషి అనుకునే తరహాలో కనిపిస్తున్నాడు. తెలుగులో సముద్రఖని పాత్ర కోసం ఈ స్థాయిలో డిఫరెంట్ లుక్ తో కనిపించడం ఇదే ఫస్టు టైమ్. ఆయన లుక్ ను బట్టి పాత్ర చాలా పవర్ఫుల్ అనే విషయం తెలిసిపోతూనే ఉంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news