టీడీపీకి పవన్ సెగలు..ఇదేంటి బాబు అంటున్న తమ్ముళ్ళు.!

-

తెలుగుదేశం పార్టీకి అటు జగన్ తోనే కాదు..ఇటు పవన్ తో కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టి‌డి‌పిని చాలావరకు జగన్ అణిచివేశారు. అయినా ఎలాగోలా చంద్రబాబు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఇక పవన్ మద్ధతు తీసుకుని నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. కానీ ఇక్కడే పవన్ కూడా రివర్స్ అవుతున్నారు. 2014లో ఎలాగో మద్ధతు ఇచ్చారు..అప్పుడు జనసేన పోటీ చేయలేదు.

కానీ ఈ సారి పవన్ తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారు. అలాగే తన సపోర్ట్ లేనిదే టి‌డి‌పి గెలవడం కష్టమే. ఈ నేపథ్యంలో తనకు సి‌ఎం సీటు ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చు. దీని వల్ల టి‌డి‌పికి ఎటు చేసిన నష్టమే. అయితే పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ చంద్రబాబు మాత్రం జనసేనతో పొత్తుని దృష్టిలో పెట్టుకునే రాజకీయం చేస్తున్నారు.

ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు ఏ ఏ సీట్లు ఇవ్వాలని అనుకుంటున్నారో ఆయా సీట్లలో బాబు పర్యటించడం లేదు. అలాగే ఆయా స్థానాల్లో టి‌డి‌పి నుంచి డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టడం లేదా, ఇంచార్జ్ లని లేకుండా చేయడం చేస్తున్నారు. అంటే ముందు నుంచే జనసేనకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. కానీ పవన్ అలా చేయడం లేదు. వారాహి యాత్రతో దూకుడు మీద ఉన్న పవన్..టి‌డి‌పికి పట్టున్న స్థానాల్లో కూడా పర్యటించేస్తున్నారు. అలాగే వరుసగా ఇంచార్జ్‌లని ప్రకటిస్తున్నారు. ఈ మధ్య టి‌డి‌పి బలంగా ఉన్న తణుకులో పర్యటించారు. అక్కడ జనసేన అభ్యర్ధిని ఫిక్స్ చేశారు.

తాజాగా పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు స్థానాల్లో ఇంచార్జ్‌లని పెట్టారు. అటు పెందుర్తి సీటు ఆశిస్తున్న పంచకర్ల రమేష్ బాబుని జనసేనలోకి తీసుకుంటున్నారు. ఇలా టి‌డి‌పికి పట్టున స్థానాల్లోనే పవన్ రాజకీయం చేయడంపై తమ్ముళ్ళు అసంతృప్తిగా ఉన్నారు..బాబు ఏమో జనసేన కోసం స్థానాలు వదిలేస్తారు..పవన్ ఏమో అలా చేయడం లేదు..అలాంటప్పుడు. పొత్తు వదిలేసి ఒంటరిగానే పోటీ చేస్తే బెటర్ అని అంటున్నారు. చూడాలి మరి ఈ పొత్తు అంశం ఎక్కడకి వెళుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news