సీట్లు తేల్చేసిన పవన్..బాబు చేతుల్లోనే ఇంకా?

-

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. అంటే గత ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని అంచనా వేసుకుని రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు-పవన్ కలిశారు. దీని బట్టి చూస్తే పొత్తు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది. అయితే అధికారికంగా సీట్లు పంపకాలపై క్లారిటీ లేదు.

కాకపోతే మీడియాలో మాత్రం జనసేనకు టీడీపీ ఇవే సీట్లు ఇస్తానందని, కాదు జనసేన సీట్లు డిమాండ్ చేస్తుందని ప్రచారం మాత్రం ఉంది. కానీ సీట్ల విషయం మాత్రం క్లారిటీ లేదు. తాజాగా పవన్ శ్రీకాకుళంలో మాట్లాడిన వ్యాఖ్యలు బట్టి చూస్తే ఆయన 50 సీట్ల వరకు కోరుకుంటున్నారని మాత్రం అర్ధమవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన ప్రభావం 53 సీట్లలో ఉందని చెప్పుకొచ్చారు. అంటే ఆ సీట్లలో వైసీపీకి టీడీపీపై వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ.

ఒకవేళ టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఆ సీట్లలో వైసీపీ గెలిచేది కాదనేది పవన్ అంచనా. అంచనా ఏముంది అదే నిజం. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రానివ్వకూడదు అని, టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే పవన్ పరోక్షంగా 50 సీట్లు డిమాండ్ చేస్తున్నారని మాత్రం అర్ధమవుతుంది.

కానీ టీడీపీ అన్నీ సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉందా? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే టీడీపీకి 175 స్థానాల్లో నేతలు ఉన్నారు. గట్టిగా చూసుకుంటే 30 స్థానాల్లో  బలమైన నాయకత్వం లేదు..అలాంటి వారు సీట్లు త్యాగం చేయవచ్చు గాని, బలమైన నాయకులు సీట్లు వదులుకోవాలంటే కష్టమైన పని. మరి చూడాలి జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో.

Read more RELATED
Recommended to you

Latest news