టీడీపీకీ మరో ఎదురుదెబ్బ.. 15 మంది ఎమ్మెల్యేలతో నేడు బీజేపీలో చేరనున్న గంటా?

-

మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిచింది. 3 ఎంపీలను గెలిచింది. 23 ఎమ్మెల్యేల్లో 15 మంది ఎమ్మెల్యేలతో పాటు గంటా కూడా బీజేపీలో చేరుతుండటంతో టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేయబోతున్నారు.

టీడీపీకి దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి నిన్ననే గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే కదా. వాళ్లు అలా టీడీపీకి గుడ్ బై చెప్పి.. ఇలా బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వాళ్లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్లు బీజేపీలో చేరి ఒక రోజు కూడా కాలేదు.. అంతలోనే టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగులుతోంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు టీడీపీకి టాటా చెప్పబోతున్నారట. ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

ఆయన ప్రస్తుతం వైజాగ్ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నరాట. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి గంటా ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో ఉన్నారట. వాళ్లంతా శ్రీలంక నుంచి డైరెక్ట్ గా ఇవాళ ఢిల్లీ వెళ్లి.. బీజేపీలో చేరనున్నారట.

మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిచింది. 3 ఎంపీలను గెలిచింది. 23 ఎమ్మెల్యేల్లో 15 మంది ఎమ్మెల్యేలతో పాటు గంటా కూడా బీజేపీలో చేరుతుండటంతో టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేయబోతున్నారు. దీంతో టీడీపీకి మిగిలేది ఏడుగురే. అప్పుడు టీడీపీకి ప్రతిపక్షహోదా కూడా ఉండదు. అది కూడా పోయే అవకాశం ఉంది. మిగిలిన 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news