చంద్రబాబు గారు వెళ్ళకండి… వాపోతున్న నేతలు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం తెలుగుదేశం పార్టీకి పెద్ద తల నొప్పిగా మారింది. రాజకీయంగానే కాదు, ఆ పార్టీకి వ్యక్తిగతంగా జగన్ చేసిన ప్రకటన తల నొప్పిగా మారింది. నేతల మధ్య చీలిక రావడం, కొంత మంది నేతలు జగన్ నిర్ణయాన్ని ప్రసంశించడం వంటివి ఇబ్బందికరంగా మారాయి. కొంత మందిని చంద్రబాబు అదుపు చేస్తున్నా సరే వాళ్ళు ఆయన మాటను లెక్క చేసే పరిస్థితి పార్టీలో లేదు. అది అలా ఉంచితే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేస్తున్నారు.

గత నాలుగు రోజులు గా దీనిపై రైతులు ఉద్యమం చేస్తున్నారు. మహిళలు చిన్నారులు, రైతులు పెద్ద ఎత్తున రోడ్లకు అడ్డంగా కూర్చుని నిరసనలు తెలుపుతున్నారు. దీనికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. నేడు ఆయన రైతులు నిర్వహిస్తున్న మహాధర్నాలో పాల్గొనడానికి వెళ్తున్నారు. రైతులకు సంఘీభావం గా ఆయన నిరసనలో పాల్గొంటారు. ఇప్పుడు దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలే చంద్రబాబుని వద్దని వారిస్తున్నారు.

ఇప్పటికే రాజకీయంగా నష్టపోయామని ఈ నిర్ణయంతో పూర్తి ఇబ్బందులు పడతామని అగ్ర నేతలు చంద్రబాబుకి చెప్పినట్టు సమాచారం. రైతులకు మద్దతుగా వెళ్తే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని, కాబట్టి దూరంగా ఉంటె మంచిది అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం మనని నమ్మి రైతులు భూములు ఇచ్చారని వెళ్ళకపోతే చులకన అవుతామని, దాదాపు ఆరు జిల్లాల్లో జగన్ నిర్ణయంపై వ్యతిరేకత ఉందని అంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news