వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరడం ఖాయమైపోయినట్లే కనిపిస్తోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన వెంటనే రఘురామ, బీజేపీలో చేరడం ఫిక్స్ అని ప్రచారం జరుగుతుంది. ప్రచారమనే కాదు.. ఇటీవల రఘురామ మాటలు బట్టి చూస్తే ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా కేంద్రంలోని బీజీపీ, రఘురామకు సపోర్ట్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆయనకు వై కేటగిరీ సెక్యూరిటీ కేటాయించారు. ఆయనకు పార్లమెంట్ స్థాయిలో కీలక పదవి ఇచ్చారు.
ఇక వైసీపీ ఎంత ప్రయత్నించిన.. రఘురామపై అనర్హత వేటు పడటం లేదు.. అంటే బీజేపీ సపోర్ట్ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే బీజేపీతో జగన్ రహస్య సంబంధాలు నడుపుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు రఘురామ, బీజేపీలో ఎలా చేరతారని తమ్ముళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
దీనికి రఘురామ వివరణ కూడా ఇస్తున్నారు.. మొన్నటివరకు బీజేపీతో జగన్‌కు సంబంధాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు అవి తగ్గుతున్నాయని, దానికి ఉదాహరణే ఏపీలో బీజేపీ నేతలు, జగన్ ప్రభుత్వంపై పోరాటాలు చేయడమని చెబుతున్నారు. వాస్తవానికి చూస్తే.. మొన్నటివరకు జగన్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించిన సోము వీర్రాజు సైతం ఇప్పుడు రివర్స్ అయ్యారు. జగన్ ప్రభుత్వంపై పోరాటాలు మొదలుపెట్టారు.
దీని బట్టి చూస్తే జగన్‌కు బీజేపీ కాస్త యాంటీ అవుతుందని అర్ధమవుతుంది. అందుకే రఘురామ కూడా బీజేపీకు మద్ధతుగా మాట్లాడుతున్నారు. పైగా తనకు కేంద్ర పెద్దలపై నమ్మకం ఉందని అంటున్నారు. అంటే ఈయన బీజేపీలో చేరడం దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే.. అలాగే నరసాపురం బరిలో బీజేపీ నుంచి పోటీ చేస్తారు.. జనసేన ఎలాగో సపోర్ట్ ఇస్తుంది. ఇక టీడీపీ సపోర్ట్ తీసుకుని గెలవాలని రాజు గారు అనుకుంటున్నారు.
చంద్రబాబు సైతం.. బీజేపీ సపోర్ట్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి, రఘురామకు మద్ధతు ఇవ్వడం గ్యారెంటీ. కానీ తెలుగు తమ్ముళ్లే కాస్త అసంతృప్తిగా ఉన్నారు.. రాజు గారు బీజేపీలో చేరితే మద్ధతు ఇవ్వొద్దని అంటున్నారు. అసలు రాజు గారు బీజేపీపై ప్రేమ కురిపించడాన్ని తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి రాజు గారి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.