పథకాలకు జగన్ పేరే ఎందుకు పెడుతున్నారో చెబుతున్న పట్టాభి!

-

రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు ఆయా రాజకీయా పార్టీలలోని పెద్దలు, చరిత్ర గురించుకున్న నాయకులు, మహానాయకుల పేర్లు పెడుతుంటారు! మన దేశంలో ఇది సహజం! అయితే.. ఈ విషయంలో కొందరు నేతలు కొన్ని ప్రభావవంతమైన పథకాలకు తమ పేర్లే పెట్టుకుంటుంటారు! అయితే ఈ విషయంలో జగన్ తన పథకాలకు తన పేరే ఎందుకు పెడుతున్నారో తనదైన్ లాజిక్ లాగారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబి రాం!

ఇది జోస్యం అనాలో లేక పిచ్చి ప్రేళాపన అనాలో లేక ఆ వంకన ఈ వంకన బాబుపై ఉన్న కక్ష ఏమైనా తీర్చుకోవాలనే తాపత్రయమో తెలియదు కానీ.. తాజా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పథాకాలకు తన పేరే పెట్టుకుంటున్నారని… జగనన్న గోరు ముద్ద, జగన్ విద్యాకానుక, మొదలైన పేర్లు పెట్టుకోవడానికి కారణం.. త్వరలో జగన్ జైలుకు వెళ్లబోతుండటమే అని చెబుతున్నారు పట్టాభి!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్తారు కాబట్టే ఆయన పేరునే అడ్డమైన పథకాలకు పెడుతున్నారని.. చెప్పుకొస్తున్నారు పట్టాభి! దీంతో సోషల్ మీడియాలో పట్టాభిపై ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు నెటిజన్లు! చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న భీమా మొదలైన పథకాలు నాడు చంద్రబాబు ఎందుకు చెప్పారు అనేది నెటిజన్ల ప్రశ్న!

నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తన పేరున కొన్ని పథకాలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అవి ప్రజలకు ఎంతవరకూ చేరువయ్యాయి.. ఆ పథకల్లో జరిగిన అవినీతి సంగతి అధికారులు చూసుకుంటారు కానీ.. మరి చంద్రబాబు ఆ పథకాలకు “చంద్రన్న” అని ఎందుకు పేరుపెట్టినట్లు! లక్ష్మీపార్వతి వేసిన బాబు అక్రమాస్తుల కేసుల విషయంలో జైలుకు వెళ్తారనా లేక ఓటుకు నోటు కేసులో ఊసలు లెక్కెట్టాల్సి వస్తుందనా.. అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు!

మరి ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమధానం చెబుతారా లేక పట్టాభి చెబుతారా అనేది తెలియాల్సి ఉంది! అయితే.. అధికార ప్రతినిధులు అనబడేవారు విమర్శలు చేయొచ్చు కానీ అవి బౌన్స్ బ్యాక్ అవుతున్నయా లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది.. టీడీపీ నేతలకు మరీ పుష్కలంగా ఉందనేది విశ్లేషకుల మాటగా ఉంది!!

Read more RELATED
Recommended to you

Latest news