మంగళగిరిలో పొలిటికల్ టెర్రరిస్ట్.. ఓటమి భయంతోనే వైసీపీ పై దాడులు….

-

మంగళగిరిలో కుప్పం రౌడీలు ఉన్నారా..? వైసీపీలో యాక్టివ్ గా ఉండే నేతలను లక్ష్యంగా చేసుకొని వారిపై దాడులకు పాల్పడుతున్నారా..? నారా లోకేష్ తన గెలుపు కోసం రౌడీ బ్యాచ్ ని నమ్ముకున్నారా ఇవే సందేహాలు ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో అందరి మదిలో మెదులుతున్నాయి.. వైసీపీ కీలక నేత మేక వెంకటరెడ్డి, కన్వీనర్ కృష్ణారెడ్డి పై దాడికి పాల్పడిన అనంతరం.. నారా లోకేష్ మంగళగిరిలో ఆకు రౌడీలు దింపారనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది.. ఓటమిభయంతోనే నారా లోకేష్ ఓటర్లను వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని చూస్తున్నారని అనేక ఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు..

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గురువారం రాత్రి టిడిపి వర్గీయులు వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు.. నారా లోకేష్ కు మరోసారి ఓటమి ఖాయం అనే భావన నియోజకవర్గం ప్రజలలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలపై దాడులు చేసి వారిని భయభ్రాంతులకు గురిచేయాలని లోకేష్ వర్గీయులు భావిస్తున్నారట.. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లి లో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను దుర్భాషలాడడమే కాకుండా.. ద్విచక్ర వాహనాలతో వారిని గుద్దారట. వైసీపీ నేత మేక వెంకటరెడ్డి, జేసిఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు యువకులు మద్యం మత్తులో వారిని చుట్టుముట్టారు.. తమ ప్రాంతాలలో ప్రచారాలు చెయ్యొద్దంటూ వారిని బెదిరించారు.. ఐదుగురు యువకులు బైకు మీద వచ్చి వారిని ఢీ కొట్టారు. కింద పడిన వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కుంచనపల్లికి చెందిన బూత్ కన్వీనర్ మేక వెంకటరెడ్డిని మరోసారి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఆయన కింద పడిపోయారు తలకు తీవ్రంగా గాయమైంది.. కనీసం జాలి కూడా లేకుండా రక్తపు మడుగులో పడి ఉన్న వెంకటరెడ్డిని కాళ్లతో తన్నుతూ కొట్టడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు..

తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్ళిన వెంకటరెడ్డిని తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు.. బ్రెయిన్ డెడ్ అయ్యిన కారణంగా ఆయన కోమాలోకి వెళ్లారు. టిడిపి గుండాలు వెంకటరెడ్డిపై హత్యయత్నం చేయడంపై వైఎస్ఆర్సిపి నేతలు భగ్గుమంటున్నారు.. ఓటమి భయంతోనే లోకేష్ డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నారా లోకేష్ పొలిటికల్ టెర్రరిస్టులా వ్యవహరిస్తున్నారని బయట ప్రాంతాల నుంచి గుండాలను లోకేష్ మంగళగిరిలో దించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news