వైసీపీ ఎమ్మెల్యే ఓటుకే ఎసరు పెట్టారు.. తొలగింపు కోసం దరఖాస్తు..!

-

ఆయన ఓటును తొలగించాలంటూ ఎన్నికల కమిషన్ కు ఫారమ్ 7 దరఖాస్తును టీడీపీ పెట్టినట్టు… ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. ఇఫ్పటికే.. లక్షల సంఖ్యలో వైఎస్సాఆర్సీపీకి చెందిన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కోసం ఫారమ్ 7 దరఖాస్తులు ఈసీకి వెళ్లాయట..

దొరికిపోయింది… టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. ఏపీలో వైసీపీ నేతల, సానుభూతిపరుల ఓట్లను తొలగించే కార్యక్రమానికి టీడీపీ తెర లేపిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వైసీపీకి చెందిన సానుభూతిపరులు చాలామంది ఓట్లను తొలగించింది ఏపీ ప్రభుత్వం. దాని కోసం పెద్ద స్కెచ్చే వేసింది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తన బినామీ కంపెనీలకు కట్టబెట్టి.. అక్కడి నుంచి ఆ డేటాను తన సొంత యాప్ సేవా మిత్రాలను అప్ లోడ్ చేయించి.. దాని ద్వారా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం ఎంతలా బరి తెగించిందంటే.. చివరకు వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటును కూడా తొలగించడానికి పూనుకున్నది. తన ఓటును తొలగించడం కోసం.. టీడీపీ దరఖాస్తు పెట్టి అడ్డంగా దొరికిపోయింది.

TDP tried to delete YCP MLA sunil kumar vote

ఆయన ఓటును తొలగించాలంటూ ఎన్నికల కమిషన్ కు ఫారమ్ 7 దరఖాస్తును టీడీపీ పెట్టినట్టు… ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. ఇఫ్పటికే.. లక్షల సంఖ్యలో వైఎస్సాఆర్సీపీకి చెందిన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కోసం ఫారమ్ 7 దరఖాస్తులు ఈసీకి వెళ్లాయట. ఇటీవలే మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఓటును తొలగించడానికి కూడా దరఖాస్తు చేశారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే ఓటు తొలగించేందుకు దరఖాస్తు చేశారు.

వామ్మో.. టీడీపీ నేతలు ఇంతలా బరి తెగిస్తున్నారంటే.. ఇంకా రాను రాను వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఇంకెన్ని బరి తెగింపు చర్యలకు పాల్పడుతారు.. అసలు ఏపీ ప్రజలను చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు.. అని ఏపీ ప్రజలు వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబు అండ్ కోకు బుద్ధి చెప్పాల్సిందేనని ఏపీ ప్రజలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news