మహేష్ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..!

-

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమాపై రిలీజ్ కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 25 అని ఫిక్స్ చేయగా మళ్లీ ఈ రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 16 వరకు షూటింగ్ ప్లాన్ చేశారట. 9 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవదు కాబట్టి మహర్షి సినిమా ఏప్రిల్ 25న రావడం నమ్మకం లేదని తెలుస్తుంది. ఇక లేటేస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాను మే 9కి వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.

దిల్ రాజు ఈరోజు రేపట్లో మహర్షి సినిమా రిలీజ్ అఫిషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి చెబుతారట. మే నెల అంటే మహేష్ కు బ్యాడ్ సెంటిమెంట్ పడుతుంది. మే నెలలో రిలీజైన మహేష్ సినిమాలు ఏవి సక్సెస్ అవలేదు. అందుకే మే నెల మహేష్ కు కలిసిరాదని ఫిక్స్ అయ్యారు. అయితే మహేష్ మహర్షి మే 9న రిలీజ్ అంటున్నారు. మరి వంశీ పైడిపల్లి మహర్షితో మహేష్ కు మే సెటిమెంట్ బ్రేక్ అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news