టీడీపీ అట్టర్ ఫ్లాప్ షో…జగన్ లాజిక్ మిస్ అవుతుంది?

ఏపీలో తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడికి నిరసనగా చంద్రబాబు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బంద్ పూర్తిగా విఫలమైనట్లే కనిపిస్తోంది. ఎక్కడకక్కడ టి‌డి‌పి శ్రేణులు రోడ్లపైకి వచ్చి బంద్ చేయాలని చూశాయి గానీ, పోలీసులు టి‌డిపి శ్రేణులకు చెక్ పెట్టేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. అయితే చంద్రబాబు ఆవేశపడి బంద్‌కు పిలుపునిచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

chandrababu naidu

అసలు ముందే టి‌డి‌పి నేతలని పోలీసులు ఎక్కడకక్కడ హౌస్ అరెస్ట్‌లు చేసేశారు. పైగా కొందరు నాయకులు హౌస్ అరెస్ట్‌లు అయిపోతే బాగుండు అనేలాగా ఇళ్లలోనే ఉండిపోయారు. మంత్రి కొడాలి నాని చెప్పినట్లు చంద్రబాబు ఒక్క బడ్డీ కొట్టు కూడా మూయించలేకపోయారు. మొత్తానికి బంద్ విషయంలో టి‌డి‌పిది అట్టర్ ఫ్లాప్ షో అని చెప్పొచ్చు.

అయితే టి‌డి‌పి నేతల మాట తీరుపై, టి‌డి‌పి కార్యాలయాలపై దాడి విషయంలో సి‌ఎం జగన్ సైతం స్పందించారు. ప్రతిపక్ష టి‌డి‌పి నేతలు తమని పచ్చి బూతులు తిడుతున్నారని, తాము ప్రతిపక్షంలో ఉండగా అలాంటి బూతులు మాట్లాడలేదని అన్నారు. అలాగే తనని తిడితే కొందరు అభిమానులు తట్టుకోలేక ఆవేశాలకు లోనయ్యారని జగన్ చెప్పుకొచ్చారు. ఇక యెల్లో మీడియా ప్రభుత్వంపై బురదజల్లుతుందని మాట్లాడారు.

అయితే ఇక్కడ జగన్ చెప్పే మాటల్లో కాస్త లాజిక్ మిస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టి‌డి‌పి నేత పట్టాభి..జగన్‌ని దూషించడం కరెక్ట్ కాదని, కానీ వైసీపీ నేతలు ఎప్పుడు బూతులు మాట్లాడనట్లు జగన్ చెప్పడం కాస్త విడ్డూరంగా ఉందని అంటున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ సైతం కాస్త పరుషంగానే అప్పుడు చంద్రబాబుపై ఫైర్ అయ్యారని, ఇక అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఎలాంటి బూతులు వాడుతున్నారో చెప్పాల్సిన పని లేదని, అలాగే అభిమానులు ఆవేశాలకు లోనయ్యారని అంటున్నారు…కానీ దాడులు కరెక్ట్ కాదని జగన్ చెప్పకపోవడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు…చంద్రబాబుని తిట్టారని టి‌డి‌పి అభిమానులు ఆవేశాలకు లోనైతే పరిస్తితి ఏంటని అడుగుతున్నారు. ఏదేమైనా వైసీపీ-టి‌డి‌పిలు కలిసి జనాలతో ఆడుకుంటున్నారని అంటున్నారు.