చంద్రబాబును ఏమైనా అంటే.. ఏపీకే బీపీ వస్తుంది : నారా లోకేష్‌

కొట్టుకోవాలని వైసీపీ నేతలకు ఆనందంగా ఉంటే టైమ్ ప్లేస్ చెప్పండి మేమే వస్తామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఛాలెంజ్‌ విసిరారు. చంద్రబాబును ఏమైనా అంటే.. ఏపీకే బీపీ వస్తుందని..హెచ్చరించారు. ఎవ్వరూ లేని టైములో వచ్చి నాలుగు అద్దాలు పగల కొట్టడం కాదని.. దమ్ముంటే ఇప్పుడు రావాలని సవాల్‌ విసిరారు నారా లోకేష్. జగన్ ఓ సైకో శాడిస్ట్ అని అనుకున్నాం.. నిన్నటితో నిర్ధారణ అయిందని…. ఇంటిలో ఉన్న కుక్కలను పంపి.. తాడేపల్లి ప్యాలెస్సులో దాక్కున్నారని ఫైర్‌ అయ్యారు.

ys jagan on nara lokesh

దాడులు చేస్తే భయపడతామని అనుకోవడం తప్పు అని.. ప్రభుత్వం చేసే తప్పువను నిలదీయాలని.. అవసరమైతే పోరాడాలని ప్రజలు మాకు ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చారని మండిపడ్డారు.
మా ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు.. లేదా మూసుకుని కూర్చొవాలన్నారు. ఏపీలో జగన్ సీఎం అయ్యాక.. గంజాయి రవాణ అనేది లీగలైజ్డ్ బిజినెస్సుగా మార్చారని మండిపడ్డారు.

తెలంగాణ పోలీసులే ఏపీలో గంజాయి పండిస్తున్నారని చెబుతున్నారని… తెలంగాణ పోలీసులే ఏపీలో స్టింగ్ ఆపరేషన్ చేయడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. బోర్డర్ నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్యే తనయుడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని… డ్రగ్స్ ఫ్రీ స్టేటుగా చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయని.. హెచ్చరించారు. దాడి జరిగే 15 నిమిషాల ముందుగా సమాచారం ఇస్తే.. కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు.