పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలను కలవరపెడుతున్న మల్లన్న దూకుడు

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈదఫా ఎక్కువమంది పోటీ చేస్తున్నారు. ఈ దఫా ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు. అయితే ఈ సారి అందరి దృష్టి ఉమ్మడి నల్గొండ,వరంగల్,ఖమ్మం జిల్లాల ఫట్టభద్రుల స్థానంపైనే ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పాటు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్ధులు ప్రభావం చూపనున్నారు. అధికార టీఆర్ఎస్ పై దూకుడుగా విమర్శలు చేస్తూ నిరుద్యోగ సమస్యల పై గళమెత్తుతూ తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్దిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతూ అందరి దృష్టి ఆకర్షించారు తీన్మార్ మల్లన్న. సోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలలో ఒక ప్రత్యేక సాధించుకున్నారు. అయితే గతంలో ఇదే పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో దిగిన మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగి టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ,వరంగల్,ఖమ్మం జిల్లాల ఫట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లన్న చాపకింద నీరుల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ప్రొ.కోదండరాం సైతం ఇదే స్థానం నుంచి టీజేఎస్ నుంచి బరిలో దిగగా మల్లన్న స్వతంత్ర అభ్యర్దిగా జిల్లాల్లో పర్యటిస్తూ విద్యావంతులు,మేథావులను కలుస్తు మద్దతు కూడగడుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు,నిరుద్యోగ సమస్యల పై యవతని ఏకంచేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను ముందుకు తీసుకెళ్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు మల్లన్న. 14 లక్షల ఉద్యోగాలిచ్చామని చెబుతున్న రాజేశ్వర్ రెడ్డి.. అది నిజమని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఇక తానిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానన్న మల్లన్న విఫలమైతే రెండున్నరేళ్లలో ప్రజా రెఫరెండంకు సిద్ధంగా ఉంటానన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరుతూ యువతను ఆకట్టుకుంటున్నారు.

ప్రధాన పార్టీలు పోటీలో ఉన్న ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ మాత్రం తీన్మార్ మల్లన్న టీజేఎస్ అభ్యర్ది ప్రో.కోదండరాం మధ్య నడుస్తుంది. ప్రజా సమస్యల పై ప్రశ్నించే తనలాంటి గొంతుకలను అణిచివేసే ప్రయత్నం టిఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తుందని మల్లన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనపై అక్రమ కేసులు బనాయిస్తూ తనని తన కుటుంబసభ్యుల్ని వేధిస్తున్నారని మల్లన్న మండిపడుతున్నారు. అయితే ప్రభుత్వ బెదిరింపులకు తాను భయపడబోనన్న మల్లన్న తనకు అవకాశం ఇస్తే ప్రభుత్వ అసమర్థ విధానాలపై పోరాటం చేసి ప్రజల హక్కులను సాధించి తీరుతానని భరోసా ఇస్తున్నారు.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...